గత మూడు రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ సినిమా ప్రపంచం మణికర్ణిక వివాదంతో అట్టుడికిపోతోంది. దాని వసూళ్ళ సంగతేమో కానీ దీని గురించిన ఎడతెగని చర్చ కొనసాగుతూనే ఉంది. నిన్న మధ్యాన్నం నుంచి కంగనా సోదరి రంగోలి మొదలుపెట్టిన స్క్రీన్ షాట్ల భాగోతానికి ధీటుగా క్రిష్ కూడా అంతే స్థాయిలో సాయంత్రం బదులివ్వడంతో ఇది తారా స్థాయికి చేరిపోయింది. దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే ఎంతో కొంత పబ్లిసిటీ వస్తున్న మాట నిజం. అయితే కంగనా వ్యవహార శైలి అందరికి తెలిసిందే కాబట్టి తనవైపు నిలుస్తున్న వాళ్ళ శాతం తక్కువగానే ఉంది.
క్రిష్ సహేతుకమైన ఆధారాలతో విస్పష్టంగా ఏం జరిగింది అని చెబుతున్నప్పటికీ తన పక్కన నిలుస్తున్న వాళ్ళు టాలీవుడ్ నుంచి ఎవరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. మణికర్ణిక షూటింగ్ లో ఉన్నప్పుడే ఒప్పించి మరీ లాక్కొచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ హీరో బాలకృష్ణ కాని గత నెలలో క్రిష్ నిర్మించిన అంతరిక్షం హీరో వరుణ్ తేజ్ కాని కనీసం చిన్న మాట కూడా మాట్లాడే సాహసం చేయడం లేదు. సరే వాళ్ళకు సంబంధం లేని విషయమే అనుకుందాం.
మరి దర్శక కులానికి చెందినా వాడే కదా. సాటి డైరెక్టర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు క్రిష్ చేసింది రైట్ అని చెప్పే నోరు రావడం లేదు. ఈ వివాదానికి ఏ మాత్రం సంబంధం లేని వారు కూడా క్రిష్ కు బాసటగా నిలిచి సమర్దిస్తూ మాట్లాడుతున్నారు. ఆ మాత్రం చొరవ కూడా ఇక్కడ ఎవరూ తీసుకోలేకపోతున్నారు. తనకు ఇంకా 70 శాతం పారితోషికం రావాల్సి ఉందని క్రిష్ చెబుతున్నాడు. మరోవైపు తన పేరుని టైటిల్ కార్డ్స్ లో పెట్టి తీసిన భాగాన్నే మళ్ళి రీ షూట్ చేసారు అని ఆరోపించాడు.
ఇవి ఖండించాల్సిన అంశాలే. అయితే క్రిష్ కు సపోర్ట్ గా కనీసం ట్విట్టర్ లోనో సోషల్ మీడియా వేదికలోనూ ఎవరు ముందు రాకపోవడం అనుమానాలు రేకెత్తించేదే. మరోవైపు క్రిష్ ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో నటించిన ఏ ఒక్కరు క్రిష్ గురించి చెప్పడం లేదు. ఒకవైపు ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ తాలుకు విషాదం నుంచి బయటికి రాకముందే ఇలా మణికర్ణిక విషయం రచ్చ కావడం క్రిష్ కు బ్యాడ్ టైం అనడానికి ఇంత కంటే ఏం కావాలి