ప్రస్తుతం ఫిలిం నగర్లో ఒకటే చర్చ. అసలు చాలామంది సెలబ్రిటీలు ఎందుకు ఇలా డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే. ఎందుకంటే ఈ మధ్యలో కాలేజీల్లో పిల్లలు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ.. ఇలా పాపులర్ అయిన సెలబ్రిటీలు ఇంకొంతమందికి ప్రేరణగా నిలిచే ప్రమాదం ఉంది. ఒక కాలేజీ విద్యార్ధి మరణంకంటే.. ఒక సెలబ్రిటీ మరణానినికి కవరింగ్ ఎక్కువ ఉంటుంది. మీడియాలో మాట్లాడితే బ్రేకింగ్ న్యూసులూ లైవ్ అప్డేట్లు.. ట్విస్టులూ.. అంటూ చాలా హంగామా చేస్తారు. ఇవన్నీ ఇంకొంతమందిపై ప్రభావం చూపించే ఛాన్స్ లేకపోలేదు.
అందుకే ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా కౌన్సిలింగ్ కావాలంటున్నారు కొంతమంది సినిమా పెద్దలు. మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ ఆధ్వర్యంలో అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. సినిమాలే జీవితం.. ఇక్కడ అవకాశాలు (తద్వారా డబ్బులు) రాకపోతే జీవితం ముగిసినట్లు కాదని.. సూసైడ్ థాట్స్ ను కట్టిపెట్టాలని ఈ సెలబ్రిటీలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే అంటున్నారు. నిజానికి ఇటువంటి థాట్స్ వచ్చినోళ్ళందరూ.. మాకు అలాంటి థాట్స్ వస్తున్నాయి అని బయటకు చెప్పరు. అందువలన ఎవరికని కౌన్సిలింగ్ ఇస్తారు? దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే.. జీవితం అనేది ఎంత అమూల్యం అంటూ సెలబ్రిటీలకు ఏదన్నా అవగాహన తరగతులు నిర్వహించడం బెటర్.
ఏదో ఒకటి చేస్తే తప్పించి.. ఒక ఉదయ్ కిరణ్.. ఒక రంగనాథ్.. ఒక విజయ్ సాయి తరువాత.. మరో పేరు వినకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రతీ సూసైడ్ ను టిఆర్పీ కోసం ఉపయోగించుకునే మీడియా కారణంగా.. సూసైడ్లకు ప్రాచుర్యం పెరిగిపోయి.. అవి నిత్యం కనిపించే యాడ్స్ తరహాలో తయారవుతున్నాయి. చూద్దాం మరి ఫిలిం ఇండస్ర్టీ ఏం చేస్తుందో!!