నడిగర్ సంఘం ఆధ్వర్యంలో తమిళనాట తారల క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఐపీఎల్ రేంజిలో నాలుగైదు జట్లుగా విడిపోయి తారలు క్రికెట్ ఆడుతున్నారు. ఆ హంగామా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంటోంది. నడిగర్ సంఘం భవనం కోసం పొరుగు చిత్ర పరిశ్రమ ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ కి మద్దతు పలికేందుకు తెలుగు తారలు కూడా పెద్దయెత్తున తరలివెళ్లారు. బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ - రాజేంద్రప్రసాద్ - అల్లరి నరేష్ - నాని తదితర కథానాయకులంతా వెళ్లారు.
తమిళనాట తెలుగు కథానాయకులకి కూడా మంచి గుర్తింపు వుంది. ఇటీవల ఎక్కువ సినిమాలు అక్కడ విడుదలవుతున్నాయి. పైపెచ్చు తెలుగు - తమిళ పరిశ్రమలు రెండూ ఒకగూటి పక్షులే. ఒకప్పుడు చెన్నైలోనే కలిసి వుండేవి. సో... ఇప్పుడు అక్కడ సదుద్దేశంతో క్రికెట్ ఆడుతున్న తారలకి మద్దతు పలికేందుకు తెలుగు తారలు తరలివెళ్లారన్నమాట. క్రికెట్ ఆడే తారల్ని ఎప్పట్లాగే ఎంకరేజ్ చేసేందుకు కథానాయకులు కూడా గ్రౌండ్లో ప్రత్యక్షమయ్యారు. తమన్నా - వరలక్ష్మి - త్రిష... ఇలా బోలెడుమంది కథానాయకులు వేడికి వేడి పుట్టిస్తూ గ్రౌండ్ లో హల్ చల్ చేస్తున్నారు.