కొవ్వు కరిగించుకోవడానికి కసరత్తులు చేయాలి. లేదా ఆటాపాటతో శారీరక శ్రమ చేయాలి. అంతేకానీ ఒళ్లు కోయించుకోవడమేంటి? అడ్డదారుల్లో వెళ్లి అడ్డంగా బుక్కయిపోవడమేంటి? నిన్నగాక మొన్న అందాల నాయిక ఆర్తి అగర్వాల్ మరణం ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. అయితే టాలీవుడ్‌లో ఇప్పటికే బోలెడుమంది సెలబ్రిటీలు లైపో సక్సెమీ చేయించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే.
తెలుగులోని చాలా పెద్ద పెద్ద స్టార్లు లైపోతో కాస్త నాజూగ్గా తయారయ్యారని అప్పట్లో ప్రచారమైంది. చిన్నా పెద్ద, ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ లైపోపైనే ఆధారపడుతున్నారు. యువహీరోలు సైతం ఒళ్లు తగ్గించుకోవడానికి ఇలాంటి శస్త్ర చికిత్సలపైనే ఆధారపడుతున్నారు. అయితే అరుదుగా సునీల్ లాంటి హీరోలు మాత్రమే ఏళ్ల తరబడి జిమ్ములకెళ్లి కసరత్తులు చేసి భారీకాయాన్ని తగ్గించుకుని 6ప్యాక్‌లు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఎవరైనా లైపో అంటేనే భయపడి చస్తున్నారు. కోయించుకుంటే బ్లేడు పడుతుందో లేదోనని భయపడిపోతున్నారు. కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించి సునీల్‌లానే జిమ్ముకెళ్లి అదనపు కొవ్వు కరిగించుకోవాలని ఆలోచిస్తున్నారు. అదీ సంగతి.