ఇప్పుడు నడుస్తోంది వింటర్ సీజన్. మరి ఇప్పుడు సన్ స్ట్రోక్ ఏంటి అనుకోకండి. ఇక్కడ మాట్లాడుతోంది సూర్యుడి స్ట్రోక్ గురించి కాదు - కొడుకుల స్ట్రోక్ గురించి. కొడుకులపై కొండంత ఆశలతో ఉన్న టాలీవుడ్ పెద్దోళ్లకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ దెబ్బ అక్కినేని నాగార్జునకు తగిలింది. పెద్ద కొడుకు నాగచైతన్య లాంచింగ్ విషయంలో ఎదురు దెబ్బ తిన్న నాగార్జునకు చిన్న కొడుకు అఖిల్ విషయంలోనూ అదే అనుభవం ఎదురైంది. అఖిల్ ను మాస్ హీరోగా లాంచ్ చేయడానికి నాగ్ పక్కా ప్లానింగ్ తోనే బరిలోకి దిగాడు కానీ.. అతడి తొలి సినిమా నిరాశ పరచడంతో నాగ్ కు పెద్ద స్ట్రోకే తగిలింది.
నాగార్జునే కాదు.. చిరంజీవి సైతం ఈ మధ్య సన్ స్ట్రోక్ ఎదుర్కొన్నాడు. చిరు రీఎంట్రీ ఇచ్చిన ‘బ్రూస్ లీ’ దారుణమైన ఫలితాన్నిచ్చింది. ఇలాంటి సినిమాతో రీఎంట్రీ ఏంటి అన్న విమర్శలు వినిపించాయి. చరణ్ కెరీర్ కు కీలకమైన ఈ సినిమాను చిరు కూడా రక్షించలేకపోయాడు. హీరోలకే కాదు.. నిర్మాతలకు కూడా సన్ స్ట్రోక్ తప్పట్లేదు. ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ‘కొలంబస్’ సంగతేమైందో తెలిసిందే. కొడుకును నిలబెట్టడం కోసం ఈ సినిమాకు రాజే కథ - స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఇంకో పక్క బెల్లంకొండ సురేష్ సైతం కొడుకు శ్రీనివాస్ ను హీరోగా నిలబెట్టడానికి తంటాలు పడుతున్నాడు. శ్రీనివాస్ తొలి సినిమా ‘అల్లుడు శీను’ బెల్లంకొండ మీద పెద్ద భారమే మోపింది.