టాలీవుడ్ కరోనా తరువాత కొత్త పుంతలు తొక్కుతోంది. మునుపెన్నడూ లేని విధంగా మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ షాకిస్తున్నారు. ప్రొడక్షన్ కంపనీలు కూడా పోటీపడుతూ పాన్ ఇండియా స్థాయి సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ మూవీస్ ని కూడా నిర్మిస్తూ జోరు పెంచేశాయి. ఇందులో ఓ క్రేజీ ప్రొడక్షన్ కంపనీ ఇప్నడు టాలీవుడ్ ని రూల్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టాలీవుడ్ లో వున్న క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్), శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ( దిల్ రాజు), యువీ క్రియేషన్స్ , సురేష్ ప్రొడక్షన్స్ ( డి. సురేష్ బాబు) వంటి సంస్థలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ కూడా వుంది.
అయితే ఈ క్రేజీ ప్రొడక్షన్ కంపనీల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పడు టాలీవుడ్ ని రూల్ చేస్తోంది. మినిమమ్ బడ్జెట్ మూవీస్ నుంచి 'పుష్ప 2' లాంటి మినిమమ్ బడ్జెట్ సినిమాల వరకు పలు క్రేజీ మూవీస్ నిర్మిస్తూ టాలీవుడ్ లో క్రేజీ ప్రొడక్షన్ కంపనీగా టాప్ లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో ఏడు సినిమాలున్నాయి. 2015లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సంస్థ అత్యంత భారీ స్థాయిలో తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మైత్రీ ప్రయాణం టాలీవుడ్ లో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది.
2016లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' ని నిర్మించిన మైత్రీ సంస్థ ఈ మూవీ కూడా కొరటాల శివ డైరెక్షన్ లోనే నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో 2018లో ఏకంగా మూడు చిత్రాలని నిర్మించింది. ఇందులో రామ్ చరణ్ - సుకుమార్ ల కలయికలో రూపొందించిన 'రంగస్థలం' బ్లాక్ బస్టర్ గా నిలవగా నాగచైతన్యతో చేసిన 'సవ్యసాచి', మాస్ మహారాజా రవితేజ తో నిర్మించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' తీవ్ర నిరాశకు గురిచేశాయి.
ఇక 2019లో ఈ సంస్థ ఏకంగా నాలుగు సినిమాలని నిర్మించింది. సాయి ధరమ్ తేజ్ తో 'చిత్రలహరి', విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్', నానితో 'గ్యాంగ్ లీడర్', శ్రీసింహా తో 'మత్తు వదలరా' (అసోసియేట్) నిర్మించారు. ఇక 2021లో పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలని జంటగా పరిచయం చేస్తూ 'ఉప్పెన' చిత్రాన్ని నిర్మించింది. సుకుమార్ తో కలిసి నిర్మించిన ఈ మూవీతో ఆయన శిష్యుడు బుచ్చిబాబు సాన ని దర్శకుడిగా పరిచయం చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన వంద కోట్ల క్లబ్ లో చేరింది.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ ల కాంబినేషన్ లో చేసిన 'పుష్ప ది రైజ్'పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా హడావిడిగా విడుదల చేసిన ఈ మూవీ రూ. 365 కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఉత్తరాదిలో ఎలాంటి ప్రచారం లేకుండానే ఈ మూవీ అక్కడ సంచలనాలు సృష్టించింది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు - పరశురామ్ ల కలయికలో 14 ప్లస్ రీల్స్ తో కలిసి 'సర్కారు వారి పాట'ని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది.
ప్రస్తుతం మైత్రీ చేతిలో మొత్తం తొమ్మిది క్రేజీ సినిమాలున్నాయి. నేచురల్ స్టార్ నానితో 'అంటే సుందరానికి', సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. బాలకృష్ణ 107 వ చిత్రం, విజయ్ దేవరకొండ - సమంత జంటగా శివ నిర్వాణ రూపొందిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఖుషీ' చిత్రాన్ని నిర్మిస్తోంది. మెగాస్టార్ తో 'వాల్తేరు వీరయ్య', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో 'భవధీయుడు భగత్ సింగ్' తో పాటు అల్లు అర్జున్ తో 'పుష్ప 2' నిర్మించబోతోంది. వీటితో పాటు కల్యాణ్ రామ్ హీరోగా కొత్త డైరెక్టర్ తో 20 కోట్ల బడ్జెట్ తో ఓ మూవీ చేయబోతోంది.
అదీ కాకుండా 2 కోట్లతో కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కడూరి డైరెక్షన్ లో ఓ స్మాల్ బడ్జెట్ మూవీని చేస్తోంది. అంతే కాకుండా చాలా మంది హీరోలకు, డైరెక్టర్లకు కూడా మైత్రీ ఇప్పటికే అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసింది. ఇలా క్రేజీ స్టార్ల సినిమాల నుంచి కిరణ్ అబ్బవరం లాంటి స్మాల్ హీరోతోనూ సినిమాలు చేస్తూ మైత్రీ మూవీమేకర్స్ సంస్థ టాలీవుడ్ ని రూల్ చేస్తోంది .