మామూలుగా ప్రతీ సినిమా రిలీజ్ అయినప్పుడు.. మీడియా వారి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఒక స్పెషల్ షో వేస్తారు. చాలా వరకు మీడియా వారందరూ ఇక్కడే సినిమాలను తిలకిస్తారు. అయితే ఈ షో కు ఒక ప్రత్యేకత ఉంది. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఒక్క విజిల్ కూడా పడదు. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు. జోకులకు నవ్వరు. ఎందుకో తెలుసా?
ఏమీ లేదు.. ఈ షో కోసం వచ్చే వారందరూ దాదాపు రివ్యూలు రాసే రైటర్లు.. టివిల్లో సినిమాలను ఏకిపాడేసే వ్యాఖ్యాతలే ఉంటారు. సో.. ఎవరైనా నవ్వినా.. లేదా తమ ఫీలింగ్ బయటకు చెప్పేసినా.. వారు పలానా హీరో ఫ్యాన్ అనో.. పలానా సీన్ వారికి నచ్చేసిందనో పక్కవారికి అర్ధమైపోతుందని వారి ఫీలింగ్. అందుకే అస్సలు ఏ మాత్రం ఎక్స్ ప్రెషన్ అనేది లేకుండా దాదాపు 90% మంది ఇక్కడ సినిమా చూస్తుంటారు.
ఇకపోతే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. తొలిసారీ ఈరోజు మీడియా షో లు.. అరుపులు - కేకలు - విజిల్సు - చప్పట్లు వినిపిస్తూ అరిపించాయ్. ఎందుకంటే.. బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ క్యామియో పవర్ అది. ఒక్కసారి ఆయన స్ర్కీన్ మీద కనపడగానే అందరూ ఊగిపోయారు. అస్సలు రెగ్యులర్ గా ఎక్స్ ప్రెషన్లు ఇవ్వని కూడా ఈరోజు ఓ సినిమా లవర్ టైపులో రెచ్చిపోయారు. అంతా చిరు ఎఫెక్ట్!!!