జక్కన్నతో పోటీ అవసరమా!

Update: 2017-09-01 08:51 GMT
నాకు నేనే పోటీ నాకు ఎవరు లేరు సాటి అనేంతగా దర్శకు ధీరుడు రాజమౌళి కెరీర్ నడుస్తోంది. బాహుబలి సిరీస్ తరువాత జక్కన్న నెక్ట్స్ స్టెప్ పై ఇంతవరుకు క్లారిటీ లేదు. కానీ ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఓ సీనియర్ డైరెక్టర్ కి మింగుడు పడటం లేదని ఈ మధ్యలో ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సక్సెస్ ట్రాక్ లో ఉన్న ఆ దర్శకుడు ప్రతి విషయాన్ని జక్కన్నతో పోలిక పెట్టుకోవడం, అతనితో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి తలనొప్పిగా మారుతుందని ఫిల్మ్ ఛాంబర్ లో టాక్స్ హల్ చల్ చేస్తున్నాయి. గతేడాది ఓ మెగా హీరోతో సినిమా తీసి - బాహుబలి రికార్డ్ బ్రేక్ చేశామంటూ ప్రచారం చేయాల్సిందిగా నిర్మాతల పై ఆ దర్శకుడు ఒత్తిడి తెచ్చాడట, కానీ సీనియర్ నిర్మాత కావడంతో ఆ దర్శకుడుని అప్పుడు కట్టడి చేసి, తన బిజినెస్ ట్రిక్స్ తో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్స్ తెచ్చుకున్నాడట ఆ నిర్మాత.

అయితే ఇదంతా తన డైరెక్షన్ వల్లే జరిగిందని ఆ వెంటనే ఓ క్రేజ్ లేని హీరోతో సినిమా స్టార్ట్ చేసి వారి దగ్గర భారీగా పారితోషికం వసూల్ చేశాడట ఆ దర్శకుడు. అంతటితో ఆగకుండా బాహుబలి 2 వసూళ్లని చాలా ఏరియాల్లో తన లేటెస్ట్ మూవీ అధిగమించిదని ప్రచారం చేయడం గమనార్హం. అయితే రాజమౌళితో పోలిక పెట్టుకొని ఎలాగైనా నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకుందామనే ఆ దర్శకుడు ఇలా ప్రయత్నిస్తున్నట్లుగా తేలింది. దీంతో పులిని చూసి నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్కని నక్కే అంటారు కానీ పులి అనరు అని ఆ దర్శకుడు పై ఫిల్మ్ నగర్ లో ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో!
Tags:    

Similar News