'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కళ్యాణ్ కృష్ణ కురసాల.. మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వెంటనే 'రారండోయ్ వేడుకచూద్దాం' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే మూడో మూవీ 'నేల టికెట్' దర్శకుడికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకొని 'బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కళ్యాణ్. అక్కినేని తండ్రీకొడుకులు కింగ్ నాగార్జున - నాగచైతన్య హీరోలుగా 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
కరోనా పాండమిక్ టైంలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన 'బంగార్రాజు'.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో కళ్యాణ్ కృష్ణ కురసాల కెరీర్ లో హ్యాట్రిక్ హిట్ వచ్చి చేరినట్లైంది. అయితే ఈ మల్టీస్టారర్ వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ టాలెంటెడ్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయారు.
నిజానికి 'బంగార్రాజు' తర్వాత ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి సైన్ చేశారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. కల్యాణ్ కృష్ణతో సినిమా చేయడం ఆనందంగా ఉందని.. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామని తెలిపారు.
ద్విభాషా చిత్రం కోసం జ్ఞానవేల్ రాజా దగ్గర దర్శకుడు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. కానీ తమిళ నిర్మాతకు మాత్రం ఇప్పుడు స్టార్ హీరోల కాల్షీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ ఇప్పటి వరకూ నాగార్జున - రవితేజ - నాగచైతన్య వంటి ముగ్గురు పేరున్న హీరోలతోనే పనిచేశారు. నెక్స్ట్ సినిమాకు తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న హీరో కూడా ప్రయత్నిస్తున్నారట.
అయితే ఇప్పుడు స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేకపోవడంతో.. కళ్యాణ్ కృష్ణ కురసాల కొత్త ప్రాజెక్ట్ ను మొదలు పెట్టలేకపోతున్నాడని.. ఏ హీరో నుంచి పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడని అంటున్నారు. సక్సెస్ ఫుల్ సినిమా తీస్తే సరిపోదు.. అదృష్టం మరియు ఇతర అంశాలు కూడా కలిసిరావాలని చెప్పడానికి 'బంగార్రాజు' దర్శకుడే ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కళ్యాణ్ కృష్ణ హైదరాబాద్ నుంచి వైజాగ్ కు మకాం మార్చాడని చెప్పుకుంటున్నారు. అయితే దర్శకుడు విశాఖలో ఉంటోంది 'లంబసింగి' సినిమా కోసం అనేవారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు డైరెక్టర్ గా ఆకట్టుకున్న కళ్యాణ్.. ఇప్పుడు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.
భరత్ రాజ్ - 'బిగ్ బాస్' ఫేమ్ దివి వైధ్య హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'లంబసింగి' సినిమా నిర్మాణంలో కళ్యాణ్ భాగం పంచుకుంటున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. 'గాలి పటం' ఫేమ్ నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీకే మోహన్ నిర్మింస్తున్నారు. ఏదేమైనా కల్యాణ్ వీలైనంత త్వరగా తన తదుపరి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.