టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది యువ దర్శకుల హవా కనిపిస్తోంది. కారణం కొంత మంది స్టార్ డైరెక్టర్ల సపోర్ట్ వల్లే చాలా మంది దర్శకులుగా మారుతున్నారు. గతంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, సాగర్, ముత్యాల సుబ్బయ్య, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల వద్ద వర్క్ చేసిన వారు ఈ దర్శకుల ప్రోత్సాహం వల్లే ఎక్కువగా దర్శకులయ్యారు. ఇండస్ట్రీలో నిలబడ్డారు. అయితే కె. రాఘవేంద్రరావు వద్ద వర్క్ చేసిన వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే దర్శకులు కావడం గమనార్హం.
ప్రస్తుతం ఇండస్ట్రీలో రాజమౌళి నుంచి సురేందర్ రెడ్డి వరకు చాలా మంది అగ్ర దర్శకులున్నారు. స్టార్ డైరెక్టర్లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే ఇందులో చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే తమ వద్ద ఏడీలుగా (అసిస్టెంట్ డైరెక్టర్లుగా) వర్క్ చేసిన వారిని దర్శకులుగా ప్రోత్సహిస్తున్నారు. కొంత మంది మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. వర్మ తన వద్ద వర్క్ చేసిన ఏడీలని హీరోలకు రికమెండ్ చేయకపోయినా వారు చేసిన సినిమాలని మాత్రం ప్రోత్సహిస్తుంటారు.
అయితే ఒక దర్శకుడు మాత్రం తన వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసిన వారిని మూడవ సినిమా నుంచి తన యూనిట్ లో కనిపించొద్దని, దర్శకుడిగా ట్రైల్స్ వేసుకోమని సలహా ఇస్తుంటారట.
అంతే కాకుండా తనకు అత్యంత సన్నిహితంగా వుంటే హీరోలకు తన అసిస్టెంట్ లని రిఫర్ చేస్తూ మంచి కథ చేశాడు అవకాశం వుంటే వినండి, నచ్చితే చేయండి అని చెబుతుంటారట. ఒక వేళ కథ నచ్చి అవకాశం ఇచ్చారని తెలిస్తే సదరు హీరో, ప్రొడ్యూసర్లకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ వారికి ధన్యవాదాలు చెప్పడం ఓ స్టార్ డైరెక్టర్ ఆనవాయితీగా పెట్టుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఇండస్ట్రీ జనం.
ఆ దర్శకుడు మరెవరో కాదు వి. వి.వినాయక్. ప్రస్తుతం ఆయన చేతిలో `ఛత్రపతి` హిందీ రీమేక్ తప్ప మరో సినిమా లేదు. కానీ దర్శకుడిగా తన ఏడీలకు ఆయనొక వినయ విధేయ రామ లాగా వినయ విధేయ వినాయక్. తన వద్ద వర్క్ చేసిన ప్రతీ ఏడీ అంటే టాలెంట్ వున్న ప్రతీ ఏడీకి వెనకుండి తన వంతు సహాయాన్ని చేస్తుంటారట. అవసరం వుంటే హీరోకు కూడా కాల్ చేసి మావాడి దగ్గర మీకు సరిపోయే కథ వుంది ఒక సీరి వినండి.. విని నచ్చితేనే చేయండి అని చెబుతుంటారట.
ఇలా ఇండస్ట్రీలో ఏ స్టార్ డైరెక్టర్ తన అసిస్టెంట్ లకు చేయని సహాయాన్ని చేస్తూ వినాయక్ వారికి అండగా నిలుస్తుండటం నిజంగా అభినందనీయమని చెబుతున్నారు. కొంత మంది దర్శకుడు టాప్ రేంజ్ లో వున్నా తమ వద్ద పని చేసిన ఏడీలు ఫోన్ చేసినా పట్టించుకోలేని విధంగా ప్రవర్తిస్తున్నా వి.వి.వినాయక్ మాత్రం తనకు తోచిన సహాయాన్ని చేస్తూ తన వద్ద వర్క్ చేసిన వారు దర్శకులుగా నిలబడటానికి సహాయ సహకారాలని అందిస్తుండటం గొప్ప విషయమే.