మామూలుగా మనోళ్లు ఒక రిలీజ్ డేటుకు ఫిక్సయ్యారంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఆ డేటు మిస్సవ్వకూడదు అంటుంటారు. ప్రొడక్షన్ ప్లానింగ్ లో చాలా లోపాలు ఉన్నప్పటికీ.. రాత్రీపగలూ పనిచేసేసైనా కూడా.. సినిమాను ఆ డేట్లో రిలీజ్ చేసేయాలని శ్రమిస్తారు. అసలు డేట్ మిస్సయితే ఏమవుతుంది? మన దగ్గర బాలీవుడ్ టైపులో స్లాట్ సిస్టం ఏం లేదుగా. కాని డేట్ మిస్సయితే అభిమానులు మనోభావాలు దెబ్బతింటాయ్. సో మిస్సవ్వం. కాకపోతే ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు అందరూ మారిపోయారు.
ముందుగా 'జనతా గ్యారేజ్' విషయం తీసుకుంటే.. చెప్పిన డేటుకు సినిమా రాలేదు. ఆగస్టు 12కు రావాల్సిన సినిమా సెప్టెంబర్ 2 కు వెళ్ళిపోయింది. బ్యాలెన్స్ వర్క్ షూటింగ్ చేయడానికి తనకు తగిన సమయం కావాలని.. డేటు కోసం చూసుకుంటే క్వాలిటీలో రాజీ పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు దర్శకుడు కొరటాల శివ. కట్ చేస్తే.. ప్రేమమ్ సినిమా కూడా అంతే. అనుకున్న డేట్ వదిలేసి.. లేటుగా సినిమాను దించారు. నన్నడిగితే నేనే రీషూట్ చేయమన్నాను.. సినిమా మీకు నచ్చేవరకు రీషూట్ చేయండి పర్లేదు అని ప్రొడ్యూసర్లకు చెప్పాను అంటూ స్వయంగా నాగ్ సెలవిచ్చారు. గత ఏడాది తొందరపడి.. డేటును మిస్సవకూడదు అంటూ బ్రూస్ లీ అండ్ అఖిల్ సినిమాలు ఆవేశపడ్డాయి. రిజల్టు తెలిసిందే. ఈ ఏడాది జనతా గ్యారేజ్ అండ్ ప్రేమమ్ రిజల్టు కూడా తెలిసిందే. సో రిలీజ్ డేట్ మారితే ఏమవ్వదు.. సినిమా ఔట్పుట్ ముఖ్యం అంటూ టాలీవుడ్ లో మార్పు వచ్చేసింది కదూ.
ఇకపోతే ఈ మార్పు ప్రభావం మరో సినిమాపై కూడా పడిందండోయ్. ఆల్రెడీ అక్టోబర్ లో వస్తానన్న ధృవ డిసెంబర్ కు పోస్టుపోన్ చేసుకున్నారు. సినిమా క్వాలిటీగా వచ్చాకనే రిలీజ్ అన్నాడు రామ్ చరణ్. మొన్నామధ్యన దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. ఒకవేళ గౌతమీపుత్ర శాతకర్ణి విజువల్ ఎఫెక్ట్స్ పని పూర్తవ్వకపోయినా క్వాలిటీ సరిగ్గా రాకపోయినా కూడా.. సినిమాను పోస్టుపోన్ చేస్తాం కాని అదే డేటుకు రావాలని క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం అంటూ తేల్చేశాడు. మొత్తానికి కొన్ని లాసుల దెబ్బకు టాలీవుడ్ కు బాగానే తెలిసొచ్చిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/