ఫ్రం వర్మ టు వంగవీటి కార్యక్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ జనరేషన్ లోఇండస్ట్రీని ఏలుతున్న దర్శకులు వర్మ గురించి.. ఆయన శైలి.. గొప్పదనం గురించి చాలానే మాటలు చెప్పారు.
'ఎవడి జీవితానికి వాడే హీరో అంటారు వర్మ. నాకు మాత్రం మీరే హీరోగా కనిపిస్తారు. వర్మగార అందరికీ డైరెక్టర్ కానీ.. నాకు మాత్రం ఆయన హీరో. మన సినిమాల్లో హీరోలు చెప్పిన ఏ డైలాగ్ అయినా వర్మగారికి సెట్ అవుతుంది.. నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. బాంబేకి బతికేయడానికి వెళ్లలేదు.. ఉచ్చపోయించడానికి వెళ్లా.. లాంటివన్నీ ఆయనకే సూట్ అవుతాయి. సినిమాలను మించి ఎదిగిన వ్యక్తి వర్మ, స్వాతంత్ర్యంగా బతికే వ్యక్తి' అన్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
'స్టూడెంట్ గా ఉన్నపుడు శివ చూశాను. డైరెక్టర్ అయ్యాక కూడా మిమ్మల్ని చూస్తున్నాను. పేస్ ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్నారు. రౌడీ షీటర్.. గ్యాంగ్ లాడర్.. గ్యాంగ్ స్టర్.. ఎవరిని అయినా హైయెస్ట్ లెవెల్ లో చూపిస్తారు. శివ చూసి స్టూడెంట్స్ మారిపోయారు. క్షణక్షణం చూసి అమ్మాయిలు శ్రీదేవిలా ఉండాలని ఇన్ స్పైర్ అయిపోయారు. శివ సినిమా చూసి సైకిల్ చైన్స్ కొనడం చూసా. అలాంటి ట్రెండ్ సెట్టర్ మీరు. ఈ స్టేజ్ పై అన్నమయ్య-అమితాబ్ ఉంటారని ఆశతో వచ్చాం. ఇక వర్మ గారూ.. శివ మీ మొదటి సినిమా అన్నది నిజం. వంగవీటి చివరిది అనేది అబద్దం.. ఆ అబద్దం నిజం అవ్వాలని కోరుకుంటున్నా' అని చెప్పాడు బోయపాటి శ్రీను.
'సినిమా ఫీల్డ్ కి రావడమే అదృష్టం.. ఈ స్టేజ్ పైకి రావడం ఇంకా అదృష్టం. ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తల్లిదండ్రులకు రుణపడ్డంతగా నాగ్ గారికి రుణపడి ఉంటా. సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నాగార్జున గారికి పేరు పెట్టుకున్నా. ఆయన కాంపౌండ్ లో ఆయనకు ఆ శక్తి ఇచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. రాము గారు వచ్చిన తర్వాత.. మా అందరినీ పరిచయం చేసే ధైర్యం నాగార్జన గారికి వచ్చింది. నాగ్ గారు మనిషిని మనిషిలా చూస్తారు. మాకు ఎంతో ఫ్రీడమ్ ఇస్తారు. మేమంతా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్ట్ లం. ఇక వర్మగారి విషయానికి వస్తే.. అంతకు ముందు తీసిన సినిమాలను చూసి ఇన్ స్పైర్ అయ్యి అందరూ సినిమాల్లోకి వస్తారు. ఫుల్ రివర్స్ లో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం తీసే ధైర్యం వర్మగారిలో ఉన్నాయ్. మీరు వచ్చిన తర్వాత ట్రెండ్ సెట్టింగ్ అనే మాటకు అర్ధం వచ్చింది. అలాగే మీరే ఇండస్ట్రీకి లాస్ట్ ట్రెండ్ సెట్టర్' అంటూ అటు నాగార్జునను ఇటు వర్మను ఆకాశానికి ఎత్తేశాడు వైవీఎస్ చౌదరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/