టాలీవుడ్ లో అది పెద్ద పండుగ అయిన సంక్రాంతి కోసం ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. పాండమిక్ కారణంగా గత రెండేళ్లుగా పొంగల్ బరిలో పెద్ద సినిమాల హడావిడి కనిపించలేదు కానీ.. 2023 ఫెస్టివల్ సీజన్ లో భారీ చిత్రాలు బాక్సాఫీస్ వార్ కు రెడీ అవుతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' - మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' - నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' - యూత్ కింగ్ అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలను పెద్ద పండక్కి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వీటి మధ్యలో తమిళ్ హీరో విజయ్ తెలుగు డెబ్యూ 'వారసుడు' చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇలా రాబోయే సంక్రాంతికి ఒకేసారి ఐదు క్రేజీ చిత్రాలు వస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈసారి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ వార్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు. అందులోనూ ఇవన్నీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వస్తున్న సినిమాలు కావడంతో.. థియేటర్లు సర్దుబాటు చేసుకునే విషయంలోనూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసే అవకాశం ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు సినిమాలు పండగ సీజన్ ను టార్గెట్ చేస్తుంటే.. టీ-సిరీస్ నిర్మించిన 'ఆదిపురుష్' ను యూవీ క్రియేషన్స్ వారు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఇతర రెండు చిత్రాల వెనుక అనిల్ సుంకర - దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు ఎలాగూ ఉన్నారు.
దిల్ రాజు ప్రతీ సంక్రాంతికి తన సినిమా ఒకటి ఉండేలా చూసుకుంటారు. తన బ్యానర్ లో రూపొందిన సినిమాలు లేదా తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిత్రాలను పండక్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తుంటారు. గతంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' 'ఎవడు' 'శతమానం భవతి' 'ఎఫ్ 2' 'సరిలేరు నీకెవ్వరు' 'రౌడీ బాయ్స్' వంటి సినిమాలు సంక్రాంతికే విడుదల అయ్యాయి.
ఈ క్రమంలో 'వారసుడు' చిత్రాన్ని వచ్చే పొంగల్ సందర్భంగా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేశారు. నైజాంలో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న స్టార్ ప్రొడ్యూసర్.. విజయ్ సినిమా కోసం మంచి థియేటర్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. గతంలో 'మాస్టర్' వంటి డబ్బింగ్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు ఇచ్చి.. తెలుగు 'క్రాక్' కు థియేటర్లు ఇవ్వలేదని దిల్ రాజు పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈసారి సంక్రాంతి కి కూడా నైజాంలో అదే జరుగుతుందని ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవి Vs బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ గురించి నెట్టింట ఎక్కువగా డిస్కషన్ జరుగుతుండటంతో.. అందరి దృష్టి అటువైపు మళ్లింది. దిల్ రాజు ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నాడని చెప్పాలి.
ఇప్పటికే సంక్రాంతి పోటీ నుంచి ఎవరూ తప్పుకోడానికి సిద్ధంగా లేరు. తెలుగు తమిళ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు ముందుకు వెళ్తున్నారు. కాకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ కాబట్టి.. అగ్ర నిర్మాత ఎలాంటి సరికొత్త ప్రణాళికతో వస్తాడో చూడాలి.
ఇక ప్రభాస్ సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వచ్చాయి కానీ.. అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అఖిల్ కూడా పెద్ద హీరోలను ఢీకొట్టడానికే మొగ్గుచూపుతున్నారని అర్థమవుతుంది. మైత్రీ బ్యానర్ లో వచ్చే చిరంజీవి - బాలయ్య కొన్ని రోజుల గ్యాప్ లో పోటీపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఐదు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. మరి రాబోయే రెండు నెలల్లో ఏవైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.