2023 స‌మ్మ‌ర్ ఫైట్ ఇంట్రెస్టింగ్!

Update: 2022-12-31 08:30 GMT
'వాల్తేరు వీర‌య్య‌'...'వీర‌సింహారెడ్డి'...'వారుసుడు'..'తెగింపు' లాంటి  స్టార్ హీరోల  చిత్రాలు ఈ సంక్రాంతిని ర‌స‌వ‌త్త‌రంగా మ‌లుస్తున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్దు నువ్వా?  నేనా? అన్న  రేంజ్ లో తెలుగు..త‌మిళ బాక్సాఫీస్ ల వ‌ద్ద  ర‌చ్చ జ‌ర‌గ‌బోతుంది. టాలీవుడ్లో బాల‌య్య‌..చిరు మ‌ధ్య పోటీ ఉంటే..కోలీవుడ్ లో విజ‌య్...అజిత్ ల మ‌ధ్య గ‌ట్టి పోటీ క‌నిపిస్తుంది.

ఈ వార్ ఇప్ప‌టికే ఫిక్సైపోయింది. మ‌రి ఇదే త‌ర‌హా యుద్దం స‌మ్మ‌ర్ లోనూ క‌నిపించ‌నుందా? 2023 వేస‌వి కూడా మ‌రింత వెడెక్కే అవ‌కాశం ఉందా? అంటే అవున‌నే తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'భోళా శంక‌ర్' కూడా వేస‌వి కానుగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

షూటింగ్ అప్డేట్ పై క్లారిటీ లేన‌ప్ప‌టికీ టీమ్ స‌మ్మ‌ర్ సెల‌వుల్నే టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న 'రావణసూర' చిత్రాన్ని స‌మ్మ‌ర్లోనే  రిలీజ్ చేయ‌నున్నారు. సంక్రాంతికి చిరు..ర‌వితేజ‌ ఇద్ద‌రు క‌లిపి బాల‌య్య‌పై కి దూసుకొస్తున్నా...స‌మ్మ‌ర్ కి మాత్రం  ఆ ఇద్ద‌రు విడి విడిగా పోటీ బ‌రిలో క‌నిపిస్తున్నారు.

అలాగే అక్కినేని వార‌సుడు న‌టిస్తోన్న స్పై థ్రిల్ల‌ర్  'ఏజెంట్' ని సైతం  ఎట్టి ప‌రిస్థితుల్లో  వేస‌వి సెల‌వుల్లో దించేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. స‌రైన రిలీజ్ తేదీ చూసుకుని  రిలీజ్ చేస్తే వేస‌వి సెల‌వులు క‌లిసొస్తాయ‌న్న‌ది ఏజెంట్ ప్లాన్ గా క‌నిపిస్తుంది. వీళ్ల‌కి పోటీగా త‌మిళ తంబీలు కూడా  స‌మ్మ‌ర్ కే  ట్రిగ్గ‌ర్ నొక్క‌డానికి రెడీ అవుతున్నారు.

మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్   'పొన్నియ‌న్ సెల్వ‌న్' రెండ‌వ భాగాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇది భారీ మ‌ల్టీస్టార‌ర్ కాబ‌ట్టి తెలుగు మార్కెట్ లో పోటీ త‌ప్ప‌ని స‌రిగా ఉంటుంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా స‌మ్మ్ డేట్ పై క‌ర్చీప్ వేసేసారు. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న 'జైల‌ర్' చిత్రాన్ని ఏప్రిల్ 14 రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

'జైల‌ర్' కి పోటీగా లారెన్స్ కూడా  రంగంలోకి దిగిపోతున్నాడు. ఆయ‌న న‌టిస్తోన్న 'రుద్ర‌న్' చిత్రాన్ని ఏప్రిల్ 14న  రిలీజ్ చేయాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నాడు. ఇంకా వేస‌వి సెల‌వుల కోసం మ‌రింత మంది స్టార్లు రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News