దసరా సందర్భంగా విడుదలైన మూడు భిన్నమైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఏమీ సక్సెస్ కాలేకపోయాయి. గాడ్ ఫాదర్ ఏదో మొదటి మూడు రోజుల్లో తప్పితే సోమవారం మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఇక ది ఘోస్ట్ సినిమా మొదటి రోజే డిజాస్టర్ అందుకొని మాయమైంది. ఇక మరొక చిన్న సినిమా స్వాతిముత్యం వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు.
ఇక ఇప్పుడు దీపావళి సందర్భంగా మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా వేటిక భిన్నంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పోటీతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతోంది. ఇది తమిళ సినిమాకు రీమేక్ అని అందరికీ తెలిసిందే.
ఇక వెంకటేష్ ఇందులో దేవుడి పాత్రలో నటించాడు. ఇక మరోవైపు అదే రోజు జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమా కూడా విడుదల కాబోతోంది తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళ్ తెలుగులో ఒకేసారి సందడి చేయబోతోంది.
ఇక కార్తీ నటించిన తమిళ్ డబ్ మూవీ సర్దార్ కూడా అదే రోజు రానుంది. వీటితోపాటు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా ఈ మూడు సినిమాలతో వస్తున్న ఏకైక తెలుగు స్ట్రైట్ మూవీ.
సన్నీలియోన్ తో అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లతో విష్ణు ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తున్నాడు. దసరా ఫెస్టివల్ నుంచి దీపావళికి వాయిదా పడిన ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి సక్సెస్ అందుకోవాలి అని విష్ణు ఫిక్స్ అయ్యాడు.
ఇక మరో హిందీ డబ్బింగ్ మూవీ రామ్ సేతు కూడా ఈ దీపావళికి బాక్సాఫీస్ లో పోటీ పడబోతోంది. కాకపోతే ఆ సినిమా కొంత ఆలస్యంగా అక్టోబర్ 25వ తేదీన విడుదలవుతోంది. మరి ఈ సినిమాలన్నిటిలో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.