సినిమా ఇండస్ట్రీలో వారసత్వం సహజం. అనేక మంది స్టార్లు.. తమ వారసులను హీరోలుగా తీసుకొచ్చారు. ఇంకా తెస్తూనే ఉన్నారు. వీరిలో ప్రతిభ ఉన్న వారు సెట్ అవుతున్నారు.. మిగిలిన వాళ్లంతా సైడ్ అయిపోతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు వారసుడిగా మొదట రమేష్ బాబు కొంతకాలం మూవీస్ చేసినా.. ఆ తర్వాత సినిమాలు ఆడకపోవడంతో మెల్లగా తనే తప్పుకున్నాడు. మహేష్ ఎంట్రీ ఇచ్చాక కథ మారిపోయింది. టాప్ హీరో రేంజ్ ను అందుకున్నాడు. మహేష్ కు బావ అన్న పాయింట్ తో సినిమాల్లోకి వచ్చాడు సుధీర్ బాబు. ఇప్పటివరకూ మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం ఒక్కటే హిట్ అయింది. అది కూడా మారుతి ఖాతాలోకి వెళ్లిపోయింది. కనీసం పక్కనే ఉన్న సప్తగిరి-ప్రవీణ్ లకు వచ్చిన గుర్తింపు కూడా హీరో సుధీర్ బాబుకు దక్కలేదు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా ఫ్లాపులను ఎదుర్కొన్న ఈ హీరో ఇప్పుడు సమ్మోహనం అంటూ రాబోతోన్నాడు.
ఇదే మెగా ఫ్యామిలీని చూసుకుంటే బోలెడు మంది హీరోలున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అక్కినేని కుటుంబం నుంచి హీరోలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. వీరిలో ఎంతమంది వారసులు నిలబడగలిగారో.. ఎంతమంది సైడ్ అయిపోతున్నారో జనాలు చూస్తూనే ఉన్నారు. అల్టిమేట్ గా జనాలకు కావాల్సినది.. తాము కొన్న టికెట్ కి గిట్టుబాటు అయ్యేలా చేయడం. అది చేతనైతే ఇండస్ట్రీలో నిలబడతారు. లేకపోతే..ఇక అంతే!