సాంగ్స్‌ కు కూడా పబ్లిక్‌ టాకా??

Update: 2016-02-05 17:30 GMT
ఈ మధ్య సినిమాలను ప్రమోట్‌ చేయడానికి ఎన్నో కొత్త పద్దతులను వెతికేస్తున్నారు. అసలు మీడియా చేయాల్సిన పని కూడా ఈ సినిమా వాళ్ళే చేసేసి ఇప్పుడు తమ సినిమాలకు బీభత్సమైన పబ్లిసిటీ రావాలని ప్రయత్నిస్తున్నారు. మంచిదే. కాకపోతే ఈ ప్రయత్నాలు మరీ శృతి మించేస్తున్నాయ్‌.

అసలు పబ్లిక్‌ టాక్‌ అనేది.. మీడియా హౌసులు జనాల దగ్గర నుండి ఒక సినిమా ఎలా ఉందంటూ తీసుకునే ఫీడ్‌ బ్యాక్‌. ఇప్పుడు ఈ పనని నిర్మాతలే చేయిస్తున్నారు. వాళ్ళే ఒక సినిమా రిలీజ్‌ అవగానే దానికి పబ్లిక్‌ టాక్‌ వీడియోను కూడా రికార్డు చేసి.. మీడియా సంస్థలకు పంపేస్తున్నారు. ఇకపోతే ఆ పబ్లిక్‌ టాక్‌ లో మొత్తం పాజిటివ్‌ న్యూస్‌ తప్పించి ఏమీ ఉండదని మనం వేరే చెప్పక్కర్లేదు.

ఇప్పుడు కొత్త స్టెప్పులు నేర్చుకుంటున్న ఒక కొత్త హీరో అయితే.. తన సినిమాలోని పాటలు ఎలా ఉన్నాయి అంటూ పబ్లిక్‌ టాక్‌ రికార్డు చేయించి మీడియాతో షేర్‌ చేసుకున్నాడు. బాబు గారూ.. సాంగ్స్‌ కు కూడా పబ్లిక్‌ టాకా?? పిచ్చ టూ మచ్ అయ్యా.
Tags:    

Similar News