ప్రొడక్షన్ హౌస్ పెట్టేసిన సుమంత్!!

Update: 2016-09-22 11:04 GMT
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన 'నరుడా.. డోనరుడా' రిలీజ్ కి రెడీ అయిపోతోంది. రోబో చిత్రంతో  'యంత్రుడు' తర్వాత మళ్లీ ఇప్పడు 'డోనరుడు' బాగా క్లిక్ అయింది. తెలుగులో కొత్త పదాన్ని కనిపెట్టాడనే ప్రశంసలను.. హీరో సుమంత్ -డైరెక్టర్ మల్లిక్ రామ్ లు అందుకుంటున్నారు. అయితే.. టాలీవుడ్ హీరోలు మాత్రం డోనరుడుపై డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ పై హిందీలో రూపొందిన విక్కీ డోనర్ కు తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే.

'ఇండస్ట్రీలో నువ్వు ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశావన్న మాట' అంటూ నేచురల్ స్టార్ నాని చేసిన ట్వీట్.. ఇన్ స్టెంట్ గా అందరినీ కనెక్ట్ చేసేసింది. 'ఇలాంటి డోనరుడుతో ఇప్పుడు ఇతర పిల్లలు ఎలా ఉంటారో' అంటూ రాణా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఇక నాగార్జున అయితే.. మరీ కామిక్ గా డైలాగ్ వేశాడు. 'ఇంతకీ సుమంత్ ఏం డొనేట్ చేస్తున్నాడు' అని అమాయకత్వం నటిస్తూ నాగ్ అడిగిన డైలాగ్ కేక అంతే.

ఇక నాగ చైతన్య అయితే.. సుమంత్ ను స్పెర్మ్ స్విమ్మర్ చేసేశాడు. వీళ్లందరికంటే ఓ అడుగు ముందుకేసిన కుర్ర హీరో అఖిల్.. 'స్మెర్మ్ మ్యాన్' అంటూ సుమంత్ కి బిరుదు ఇచ్చేశాడు. మొత్తానికి ఈ డోనరుడు టాలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేసేట్లుగానే ఉన్నాడు.
Tags:    

Similar News