స్పెష‌ల్ స్టోరి: కొత్త సంవత్స‌రం.. కొత్త కొత్త‌గా

Update: 2016-01-01 06:44 GMT
కొత్త సంవ‌త్స‌రం కొంగొత్త ఆశ‌ల్ని తెచ్చింది. ఎవ‌రికి వారు త‌మ‌ని తాము రివైండ్ చేసుకుంటూ కెరీర్ ప‌రంగా ముందుకు సాగాల‌న్న ప్లానింగులో ఉన్నారు. మ‌న సెల‌బ్రిటీ నాయిక‌లు 2016లో ఏం చేయ‌బోతున్నారు? వ‌్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త జీవితాల్ని ఎలా మ‌లుచుకోవాల‌నుకుంటున్నారు? అన్ని తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే...

కాజ‌ల్‌:
ఈ ఏడాది చ‌డీచ‌ప్పుడు లేకుండా గ‌డిపేస్తా. యోగా - ధ్యానం చేసుకుంటూ పీస్‌ ఫుల్‌ గా బ‌తికేస్తా. ఇన్నాళ్లు బిజీ లైఫ్ వ‌ల్ల ఆరోగ్యంపై స‌రిగా దృష్టి పెట్ట‌లేదు. కానీ ఈ ఏడాది పూర్తిగా దానిపై శ్ర‌ద్ధ పెడ‌తాను. అలాగే నా ప‌ర్స‌నాలిటీని మ‌రో లెవ‌ల్‌ కి తీసుకెళ్లే ప‌నిలో ఉన్నా.

అదాశ‌ర్మ‌:
ఇత‌రుల్ని సంతోషంగా ఉంచుతా. సేమ్ టైమ్ బ్రేవ్ డెసిష‌న్స్ తీసుకుంటా. ఇక్క‌డ ప్ర‌తిరోజూ కౌంటే. అందుకే అనునిత్యం ఎంతో జాగ్ర‌త్త‌గా మ‌స‌లుకుంటాను.  ఒత్తిళ్ల‌ను అధిగ‌మించి తెలివైన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగేలా నా మ‌న‌సును ప్రిపేర్ చేసుకుంటున్నా.

త్రిష‌:
కొత్త సంవ‌త్స‌రాన్ని కొత్త ఉత్సాహంతో కొన‌సాగిస్తాను. కొత్త ఎన‌ర్జీని నాలోకి నేను పంప్ చేసుకుంటూ ముందుకు సాగుతాను. కొత్త బిగినింగ్ అంటే ప‌వ‌ర్‌ ఫుల్ అని న‌మ్ముతా. కొత్త‌గా సాగిపోవ‌డ‌మే నా మిష‌న్‌.

ప్ర‌ణీత‌:
కొత్త సంవ‌త్స‌రంలో కొత్త‌గా బిజినెస్ లో ప్ర‌వేశించాను. ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ షిప్ కోసం ఎదిగేందుకు య‌త్నిస్తున్నా. కొత్త సంవ‌త్స‌రాన్ని ప్ర‌ణాళికాబ‌ద్ధంగా బ‌త‌కాల‌ని ప్లాన్ చేస్తున్నా. వృత్తిగ‌త‌ - వ్య‌క్తిగ‌త జీవితాన్ని బ్యాలెన్స్ ఏస్తున్నా.

తాప్సీ:
ముంబై న‌గ‌రంలో తిండి - గూడు లేని వాళ్ల‌ను ఎంతోమందిని చూశాను. అలాంటివాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలి. ఆహారాన్ని అన‌వ‌స‌రంగా వృథా చేసేవాళ్లున్నారు. అలా చేయ‌కుండా ఫుడ్‌ ని సేవ్ చేసి తిండిలేని వారికి పెట్టాల‌న్న ప్లానింగ్ ఉంది.
 
రాశీఖ‌న్నా:
కెరీర్ ప‌రంగా బోలెడంత సంతృప్తి ద‌క్కింది. కుటుంబం కోసం కాస్తంత విలువైన స‌మయాన్ని కేటాయిస్తాను.
Tags:    

Similar News