టాలీవుడ్ ప్రముఖ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ నేడు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆరోగ్యంగా ఉన్న ఆమె ఇలా గుండె పోటుతో మృతి చెందడంతో చంద్రబోస్ కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. చంద్రబోస్ స్వస్థలం అయిన వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలో మదనమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్నప్పటి నుండే చంద్రబోస్ లో సాహిత్యంపై ఆసక్తి కలిగించి, ఆయనకు చిన్నప్పటి నుండే కథలు నేర్పించారట మదనమ్మ.
తన తల్లి తనకు మొదటి గురువు అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చంద్రబోస్ చెప్పుకొచ్చారు. తండ్రి ఉపాద్యాయుడు, తల్లి గృహిణి. చిన్నప్పుడే చంద్రబోస్ కు తల్లి దండ్రుల నుండి సాహిత్యం అబ్బింది. నర్సయ్య, మదనమ్మల నాల్గవ సంతానం చంద్రబోస్. చిన్నతనంలో తనను తన తల్లి నాటకాలకు, ఉగ్గు కథలు చెప్పే వద్దకు తీసుకు వెళ్లడం వల్ల కళలపై ఆసక్తి కలిగిందని చంద్రబోస్ గతంలో చెప్పుకొచ్చాడు. తల్లి మరణంతో దుఖంలో ఉన్న చంద్రబోస్ కు సినీ ప్రముఖులు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.