సంక్రాంతి అంటే 'సినిమా పండుగ'. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతీ హీరో.. దర్శకనిర్మాత అప్పుడే తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని కోరుకుంటారు. ఒకవేళ సినిమా ఫలితం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వసూళ్ల పరంగా మంచి సినిమాగా నిలుస్తుంది. అందుకే పోటీపడి మరీ సంక్రాంతికి సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన వాటిలో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి కూడా తీవ్రమైన పోటీ ఏర్పడనుంది. కరోనా కారణంగా వాయిదా పడిన క్రేజీ మూవీస్ అన్నీ సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుంటున్నాయని తెలుస్తోంది.
థియేటర్స్ తెరుచుకోడానికి అనుమతి వచ్చినప్పటికీ ఫిలిం మేకర్స్ ఎవరూ ఇప్పుడే తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అందరూ తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేసుకునేలా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట. ఇప్పటికే అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నితిన్ 'రంగ్ దే'.. దగ్గుబాటి రానా 'అరణ్య'.. రామ్ పోతినేని 'రెడ్' ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు 'కేజీఎఫ్ 2' 'మాస్టర్' వంటి చిత్రాలు కూడా సంక్రాంతి రేస్ లో ఉండే అవకాశం ఉంది. అలానే 'వకీల్ సాబ్' 'శ్రీకారం' '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' 'ఏ1 ఎక్స్ ప్రెస్' 'చావు కబురు చల్లగా' వంటి సినిమాలు కూడా సంక్రాంతి స్లాట్ కోసం చూస్తున్నాయని తెలుస్తోంది. 'సోలో బ్రతుకే సో బెటర్' 'ఉప్పెన' సినిమాల విడుదల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
అయితే సంక్రాంతి సీజన్ లో ఇన్ని సినిమాలు ఒకేసారి థియేటర్స్ లో విడుదల చేసినా రిటర్న్స్ తెచ్చుకోవడం కష్టమే అని చెప్పాలి. అందులోనూ కరోనా లాక్ డౌన్ సమయంలో జనాలు థియేటర్స్ కి వెళ్లకుండా ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడిపోయారు. అందుకే సంక్రాంతి సీజన్ అంటూ ఇలాంటి సమయంలో థియేటర్స్ లో పోటీపడటం కంటే కొంచెం గ్యాప్ తీసుకొని సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచిందని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఏంటో రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుందేమో చూడాలి.