ట్రెండీ టాపిక్: టాలీవుడ్ మ‌రో మాలీవుడ్ లా

Update: 2020-06-28 04:00 GMT
మ‌హ‌మ్మారీ విల‌యం ఎన్నో గుణ‌పాఠాల్ని నేర్పిస్తోంది. ముఖ్యంగా వినోద‌ప‌రిశ్ర‌మ‌కు కొత్త పాఠాల్ని వ‌ల్లిస్తోంది. నేర్చుకున్న‌వాళ్ల‌కు నేర్చుకున్నంత‌. ఇంత‌కుముందులా హ‌ద్దు మీరి అదుపు త‌ప్పి ఏదీ చేయ‌డానికి లేదిప్పుడు. బ‌డ్జెట్లు ప‌రిమితం.. ఆర్టిస్టులు టెక్నీషియ‌న్లు లిమిటెడ్ .. లొకేష‌న్ల పేరుతో అన‌వ‌స‌ర హంగామా.. దూర‌పు కొండ‌ల నునుపు వ్య‌వ‌హారాలు ఇక లేవు. ఒక ర‌కంగా చెప్పాలంటే టాలీవుడ్ మ‌రో మాలీవుడ్ లా ప్ర‌వ‌ర్తించే స‌న్నివేశం వ‌చ్చేసింది.

ఇప్ప‌టికే సెట్స్ పై భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాలు చిత్రీక‌ర‌ణ‌ల‌కు రెడీ అవుతున్నాయి. మ‌హ‌మ్మారీ క‌ల్లోలం త‌గ్గితే సెట్స్ కెళ్లిపోవ‌డ‌మే. కానీ సీన్ మాత్రం వేరేగా ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పుడున్న స‌న్నివేశాన్ని రివ్యూలు చేస్తున్న ‌నిర్మాత‌లు ఇక‌పై భారీ బ‌డ్జెట్లు వ‌ర్క‌వుట‌య్యే సూచ‌న క‌నిపించ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. ఇంత‌కు ముందులా వంద‌లాది థియేట‌ర్ల‌లో సినిమాని ఆడించ‌డం సాధ్య‌ప‌డే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి ఆ మేర‌కు ముందు చూపు చూస్తున్నార‌ట‌. దీంతో బ‌డ్జెట్ల కోత‌.. పారితోషికాల కోత గురించి సీరియ‌స్ గా నిర్ణ‌యాలు తీసుకోనున్నార‌ని తెలుస్తోంది.

తొలిగా ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీకి భారీగా బ‌డ్జెట్ ని కోసేయాల‌ని ప‌రిమిత బ‌డ్జెట్ లో తీయాల‌ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ భావిస్తోంద‌ని తెలిసింది. మునుప‌టిలా లావిష్ అన్న ఆలోచ‌నే రానివ్వ‌కుండా త్రివిక్ర‌మ్ మార్క్ మాయాజాలంతో క‌థ‌ను న‌డిపించాల‌న్న‌ది ప్లాన్. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ యువ రాజకీయ నాయకుడిగా.. బిజినెస్ మాన్ గా ర‌క‌ర‌కాల వేరియేష‌న్స్ చూపించ‌నున్నాడ‌న్న ప్ర‌చారం ఉంది. అంటే త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ లు లాజిక్ తో మూవీలో స‌న్నివేశాల్ని నెట్టుకొచ్చేందుకు స్క్రిప్టులోనే మార్పు చేర్పులు చోటు చేసుకునే వీలుంద‌ని చెబుతున్నారు. దాదాపు 30కోట్ల మేర కోత వేసి త‌క్కువ బ‌డ్జెట్ లో తీయాల‌న్న ప్లాన్ ని సిద్ధం చేశార‌ట. అయితే ఇందులో హీరోకి ద‌ర్శ‌కుడికి ఎంత కోసారు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఎలానూ విదేశీ లొకేష‌న్లు లేవు కాబ‌ట్టి ఆ మేర‌కు కోత ప‌డిన‌ట్టే. ఇంకా చెప్పాలంటే మ‌ల్లూ బాబుల్లా కంటెంట్ పై కాన్ స‌న్ ట్రేట్ చేసి బ‌డ్జెట్లు కోత పెడుతున్నార‌న్న‌మాట‌.
Tags:    

Similar News