ఈ నెలలో బాక్సాఫీస్ దగ్గర మ్యాడ్ రష్ నడుస్తోంది. ప్రతి వారం రెండుకు తక్కువ కాకుండా సినిమాలు రిలీజవుతున్నాయి. అందులోనూ తర్వాతి రెండు వారాల్లో అయితే రష్ మరీ ఎక్కువగా ఉంది. 16న సుధీర్ బాబు సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో పాటు నేను మీకు బాగా కావాల్సిన వాడిని, శాకిని డాకిని సినిమాలు రిలీజవతున్నాయి. ఇవి మూడూ పేరున్న చిత్రాలే. ఇవి కాక కొన్ని చిన్నా చితకా సినిమాలు, అనువాదాలు కూడా బరిలో ఉన్నాయి.
ఇక తర్వాతి వారానికి కూడా పోటీ తీవ్రంగా ఉంది. శ్రీ విష్ణు సినిమా అల్లూరి, నాగశౌర్య మూవీ కృష్ణ వృంద విహారి.. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన గుర్తుందా శీతాకాలం, సింహా కోడూరి చిత్రం దొంగలున్నారు జాగ్రత్త 23కు షెడ్యూల్ అయి ఉన్నాయి.
ఐతే ఒకే వారం ఇలా మూణ్నాలుగు పేరున్న సినిమాలు పోటీ పడడం వల్ల దేనికీ పెద్ద ప్రయోజనం ఉండదు. రెండుకు మించి సినిమాలు రిలీజైతే బాగా డ్యామేజ్ జరుగుతుంది. ఓపెనింగ్స్ స్ప్లిట్ అవుతాయి. అసలే చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ తక్కువ. అందులోనూ స్ప్లిట్ అంటే కష్టం. ఇక ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అడ్రస్ లేకుండా పోతుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నెలాఖర్లో దసరా సెలవులు మొదలవుతున్నాయి.
సెలవుల టైంలో వచ్చే వీకెండ్‌కు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజవుతున్న సూచనలు కనిపించడం లేదు. 30న మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ రిలీజవుతోంది. దానికి పోటీగా తమిళంలోనే ధనుష్ సినిమా నానే వరువేన్ రిలీజవుతుంటే.. తెలుగులో మణి సినిమాకు పెద్దగా బజ్ లేని నేపథ్యంలో సెలవుల అడ్వాంటేజీని ఉపయోగించుకోవడానికి వేరే సినిమాలకు ఛాన్సుంది. కానీ ఆ సినిమాకు భయపడో, లేక తర్వాతి వారం చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ రిలీజవుతున్నాయనో ఈ వీకెండ్‌ను ఖాళీగా వదిలేస్తున్నారు. ఇది సరైన ప్లానింగ్ లాగా కనిపించడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.