నాలుగు సినిమాలు.. 70% అటే..

Update: 2016-10-06 04:23 GMT
ఈ శుక్రవారం టాలీవుడ్ ఒక కొత్త తరహా వార్ చూడబోతోంది. మనం ముందు చెప్పినట్లు.. ఓ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర యుద్దానికి సన్నద్దమవుతున్నాయి. నాగ చైతన్య 'ప్రేమమ్'.. సునీల్ 'ఈడు గోల్డ్ ఏహా'.. తమన్నా 'అభినేత్రి'.. కొత్త కుర్రాడి 'జాగ్వార్'... ఈ నాలుగూ రిలీజ్ అవుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు ధియేటర్లను కూడా బాగానే సంపాదించారు. అయితే ఈ సినిమాలను చూడటంలో అసలు ఆడియన్స్ మూడ్ ఎలా ఉంది? ఎటువైపు జనాలు మొగ్గుతున్నారు?

నిజానికి అర్బన్ అండ్ ఎ సెంటర్ ఆడియన్స్ అంతా కూడా 'ప్రేమమ్' సినిమాపైనే కన్నేశారు. ముఖ్యంగా యూత్ అండ్ కాలేజీ కిడ్స్ అందరూ ఈ సినిమాను చూడాలనే చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 70% ఆడియన్స్ ప్రేమమ్ వైపే మొగ్గుచూపుతున్నారని ఇప్పటివరకు జరిగిన టిక్కెట్ బుక్కింగ్స్ ను చూస్తే మనం చెప్పేయవచ్చు. మిగిలిన 30% ఆడియన్స్ అయితే.. ముందుగా ఈడు గోల్డ్ ఏహా.. ఆ తరువాత తక్కిన రెండు సినిమాలూ అంటున్నారు. ఇక మాస్ సెంటర్లలో మిల్కీ అందాలు జనాలను ఊరించేస్తాయి అనుకున్నారు కాని.. అంత సీన్ కపబడట్లేదు. అక్కడ కూడా 40% ప్రేమమ్.. 40% ఈడు గోల్డ్ ఏహా సినిమాలకే జనాలు మొగ్గుచూపుతున్నారట.

ఇకపోతే రిలీజ్ రోజున తమన్నా సినిమా.. అలాగే నిఖిల్ కుమార్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే.. ఎలాగో మండే అండ్ ట్యూస్డే కూడా అందరికీ హాలీడేసే కాబట్టి (స్కూల్ అండ్ కాలేజీ స్టూడెంట్లకు ఎప్పటినుండో సెలవలేలే).. ఈ సినిమాలకు కూడా మాంచి ఓపెనింగులు వచ్చే ఛాన్సుంటుంది. ఇక టాక్ ఎలా ఉన్నప్పటికీ ప్రేమమ్ అండ్ ఈడు గోల్డ్ ఏహా సినిమాలకు కలక్షన్ల వర్షం ఖాయం అనే అనుకోవాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News