తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమా ను చూసే విధానం మారింది.. తెలుగు లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని ఈమధ్య విడుదల అయిన సినిమా లకు నమోదు అవుతున్న సినిమాల ఫలితాలను చూస్తుంటే అనిపిస్తుంది. సీనియర్ స్టార్ హీరోలు మొదలుకుని సూపర్ స్టార్ లు... యంగ్ స్టార్ లు అంతా కూడా ప్రేక్షకుల యొక్క అభిరుచిని అంచనా వేయలేక బొక్క బోర్లా పడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెల్సిందే. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఆ పవర్ ప్యాక్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులు తిరష్కరించారు. ఆచార్య మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్న సినిమాలను తిరస్కరిస్తున్నారు. కొన్ని సినిమాలు మాత్రం అనూహ్యంగా విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దాంతో ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కథల ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోలేక జుట్టు పీక్కుంటున్నారు.
ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలను ఎలా చూపించాలో అర్థ కాక అసలు వారి కోసం కథలు రాసేందుకే సాహసించడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోలను లవ్ స్టోరీ తో చూపించలేం.. భారీ యాక్షన్ స్టోరీ తో చూపించాలంటే కష్టం.. స్టార్ హీరోల సినిమాలు కనుక కొత్తగా ప్రయత్నించాలంటే ఫలితం ఎలా ఉంటుందో భయం. అందుకే అసలు సీనియర్ స్టార్ హీరోల యొక్క కథల విషయంలో గందరగోళం ఏర్పడింది.
ఇటీవల వెంకటేష్ వద్దకు నాలుగు అయిదు కథలు వెళ్లాయట. అందులో ఏ ఒక్కటి తన ఇమేజ్ కి.. తన యొక్క సీనియారిటీకి తగ్గట్లుగా లేవని తిరస్కరించాడట. వెంకటేష్ తో ఎలాంటి కథలు అయితే వర్కౌట్ అవుతాయి అనేది తెలుగు రచయితలు ఒక అభిప్రాయం కు రాలేక పోతున్నారు.
తెలుగు రచయితలు తమ వల్ల కాదు అన్నట్లుగా చేతులు ఎత్తేస్తూ ఉంటే చేసేది లేక మన సీనియర్ లు రీమేక్ ల వెంట పడుతున్నారు. ఇతర భాషల్లో తమ ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమాలు వస్తే వాటిని రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలా వచ్చినవే గురు.. దృశ్యం త్వరలో రాబోతున్న లూసీఫర్. ముందు ముందు అయినా సీనియర్ హీరోల కోసం రచయితలు ప్రేక్షకులు ఇష్టపడే విధంగా కథలు రాస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.