సమాజిక సేవలో మేము సైతం అంటూ ముందుకు రావడం టాలీవుడ్ స్టార్లకే చెల్లింది. ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రజల్ని ఆదుకునే ఎన్నో మంచి పనులు చేశారు. ఇప్పుడు ఖండాంతరాలు దాటి వెళ్లి క్యాన్సర్ అవేర్ నెస్ కోసం ప్రచారం చేస్తూ.. ఫండ్ వసూలు చేయడం చర్చనీయాంశమైంది. అందుకోసం టాలీవుడ్ నుంచి రెండు టీమ్ లు దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ క్రికెట్ ఆడబోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ తల్వార్స్, టిసిఎ(తెలుగు సినిమా అకాడమీ) టీమ్ లు ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళతో కలిసి మన స్టార్లు క్రికెట్ ఆడబోతున్నారు. మే17, 18 తేదీల్లో రెండు మ్యాచ్ లు జరుగుతాయి. 19న సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. క్యాన్సర్ ఎవేర్నెస్ కోసం క్రికెట్ ఆడటానికి ప్రధాన కారణం. ఇందులో వచ్చిన నిధులను ఆఫ్రకికాలో ఉన్నబాలబాలికల క్యాన్సర్ అసోసియేషన్ కు అందించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియా సమావేశంలో హీరో శ్రీకాంత్ వివరాల్ని వెల్లడించారు.
ఈ మ్యాచ్ లకు శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్, తరుణ్ వంటి స్టార్లు కెప్టెన్లుగా ఉండనున్నారు. మొదటిసారి సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ ఆడటం అంటే అసలు జరుగుద్దో లేదో అనుకున్నా. నమ్మకంగా ముందుకెళుతున్నామని శ్రీకాంత్ అన్నారు. క్రికెట్ ఆడటం ముందు స్టార్ట్ చేసిందే మా టాలీవుడ్ హీరోలు. చిరంజీవి, నాగార్జున వాళ్ళందరూ మొదలు పెట్టారు. ఇది కమర్షియల్ గా ఆడే ఆట కాదు. ఒక మంచి పని కోసం ఈ కార్యక్రమానికి మేమందరం గ్రూప్ అయ్యాం. మే 16-17 దర్బార్ లో దిగుతాం. 18న గేమ్ ఉంటుంది. 19న ఒక కల్చరల్ ప్రోగ్రాం ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు.
ప్రతి ఆట ఒక మంచి పని కోసం.. సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారి ఆడుతున్నామని తరుణ్ వెల్లడించారు. టిసిఎ, తల్వార్స్ కలిసి ఆడబోతున్నాం. సౌత్ ఆఫ్రికాని కూడా మనం గెలిచివద్దామని అన్నారు. ఇక ఈ ఆటలో శ్రీధర్ రావ్, అల్లరి నరేష్, సునీల్, హీరో నిఖిల్, హీరో ప్రిన్స్, భూపాల్, శ్రీనివాస్, కిషోర్, సింగర్ కౌశల్య తదితరులు ఆట ఆడనున్నారని తెలుస్తోంది.