టాలీవుడ్ రైట‌ర్స్ టూ కాస్ట్లీ గురూ!

Update: 2023-01-01 00:30 GMT
ప్రేక్ష‌కుల్లో ఇటీవ‌ల భారీ మార్పులొచ్చాయి. స్టార్ కాంబినేష‌న్స్ ని కాకుండా కంటెంట్ కే పెద్ద పీట వేస్తున్నారు. కంటెంట్ వున్న సినిమాల‌కే స్టార్స్ లేక‌పోయినా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో క‌థా బ‌ల‌మున్న సినిమాల‌కు, సాలీడ్ కంటెంట్ కు టాలీవుడ్ లో భారీగా డిమాండ్ పెర‌డ‌గం మొద‌లైంది. దీంతో రైట‌ర్స్ కి డిమాండ్ ఏర్ప‌డింది. ఆ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఫేమ‌స్  రైట‌ర్స్ నిర్మాత‌ల‌ని భారీగా డిమాండ్ చేయ‌డం మొద‌లు పెట్టార‌ట‌.

దీంతో క్రేజీ రైట‌ర్స్ రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. పాన్ ఇండియా సినిమాల‌కు క‌థ‌లు అందిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న పేరున్న రైట‌ర్స్ ఒక్కో స్క్రిప్ట్ కు కోటికి పైనే వ‌సూలు చేస్తూ రైట‌ర్ గా స్టార్ స్టేట‌స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌డు ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ లో కొంత మంది రైట‌ర్స్ భారీగా డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నార‌ట‌. కంటెంట్ బేస్డ్ సినిమాల‌కే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న నేప‌థ్యంలో ఇప్పుడిప్పుడే స‌క్సెస్ లు సొంతం చేసుకుంటున్న రైట‌ర్స్ నిర్మాత‌ల నుంచి భారీగా డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.  

రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ ల‌ని సొంతం చేసుకుంటున్న‌ రైట‌ర్స్ కూడా ఇప్ప‌డు కోటి నుంచి ఒక్కో సినిమాకు రెండు కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా త‌మ టీమ్ హోట‌ల్ ఖ‌ర్చుల‌ని కూడా నిర్మాత‌ల‌పైనే రుద్దేస్తూ స్టార్ ప్రొడ్యూస‌ర్స్ కి సైతం చుక్క‌లు చూపిస్తున్నార‌ట‌. స‌క్సెస్ రేటు టాప్ లో వుండ‌టంతో స‌ద‌రు రైట‌ర్స్ కు ఎదురు లేకపోవ‌డంతో కోరినంత సినిమా సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్నార‌ట‌.

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కే ప్ర‌ధాన్య‌త ఇస్తుంటార‌న్న‌ది అందిరికి తెలిసిందే. ఒక్క సక్సెస్ ప‌డిందా? స‌మీక‌ర‌ణాల‌న్నీ ఆరిపోతుంటాయి. నిన్న ప‌ట్టించుకోని వారే ఒక్క స‌క్సెస్ రాగానే వెంట‌ప‌డుతూ భారీగా అడ్వాన్స్ లు ఇచ్చేస్తుంటారు. త‌మ‌కే సినిమా చేయాల‌ని పోటీలు ప‌డి మ‌రీ అడ్వాన్స్ లు ఇచ్చేస్తుంటారు. అదే స‌క్సెస్ బ్యాక్ టు బ్యాక్ వ‌రిస్తే చెప్పేదేముంది అలాంటి వారు చెప్పిందే వేదం. ఇప్ప‌డు ఓ రైట‌ర్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని, త‌న‌కున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని స‌ద‌రు రైట‌ర్ నిర్మాత‌ల నుంచి భారీగా డిమాండ్ చేస్తుండ‌టంతో ప్రొడ్యూస‌ర్స్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌వుతున్నార‌ట‌. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News