సూపర్‌స్టార్ మహేష్ ఫేవరెట్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. హాలీవుడ్ సినీప్రియులకు ఇతగాడు సుపరిచితమే. ప్రిన్స్ తన సినిమాల్లో రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడు అంటే దానికి టామ్ ఇన్‌స్పిరేషన్. అలాంటి టామ్ ఏం చేశాడంటే..?
మ్యాట్రిక్స్, ట్రాన్స్‌పోర్టర్, ట్రాన్స్‌ఫార్మర్స్ సిరీస్‌లానే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కూడా ఫేమస్ అయ్యిందంటే అది టామ్ క్రూజ్ డేర్ ఫీట్స్ వల్లే. ఇప్పటికే టామ్ హీరోగా ఈ సిరీస్‌లో నాలుగు యాక్షన్ సినిమాలు వచ్చాయి. నాలుగో సినిమా 'ఘోస్ట్ ప్రోటోకాల్' రిలీజై దేశ విదేశాల్లో డాలర్ల వర్షం కురిపించింది. ఈ సిరీస్‌లో ఐదో సినిమా 'రోగ్ నేషన్' ప్రస్తుతం ఆన్‌సెట్స్ ఉంది. అయితే మిగిలిన భాగాలన్నిటి కంటే ఈ పార్ట్‌లో విరోచితమైన పోరాటాలు, సాహస విన్యాసాలు ఉంటాయని, ఎగిరే విమానంపై ఓ పోరాటం సినిమాకే హైలైట్ అని దర్శకుడు క్రిస్టోఫర్ చెబుతున్నారు.
ఇటీవలే గాల్లో వెళుతున్న విమానంపై ఓ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించారు. టామ్ క్రూజ్ విమానం రెక్కను పట్టుకుని వేలాడుతూ ఫైట్ చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు దీనికోసం ఏకంగా ఏడు టేక్‌లు తీసుకున్నారు. మొదటిసారి బాగానే వచ్చినా.. టామ్ క్రూజ్ మరీ అంత సంతృప్తిగా లేడు. కావాలని ఏడుసార్లు రీటేకులు తీయించకున్నాడట. పర్‌ఫెక్షన్ కోసమే ఇదంతా. దటీజ్ టామ్ క్రూజ్. అందుకే ప్రిన్స్ మనోడికి ఫ్యాన్ అయ్యాడు.