స్పెష‌ల్ స్టోరి: క‌ల్లోలంలో ఆర్జించిన టాప్ 10 బ్యూటీస్

Update: 2020-06-23 05:30 GMT
వైర‌స్ మ‌హ‌మ్మారీ .. లాక్ డౌన్ల‌తో అల్ల‌క‌ల్లోల స‌న్నివేశం తెలిసిందే. అయితే ప్ర‌పంచం మొత్తం ఇలా క‌ష్టంలో ఉంటే కొంద‌రు భామ‌లు మాత్రం డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా దండీగానే కాసుల్ని దండుకున్నార‌న్న‌ది తాజా రిపోర్ట్. ఇన్ స్టా.. ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్ .. టిక్ టాక్ స‌హా ప‌లు మార్గాల్లో భారీగా ఆర్జించిన బాలీవుడ్ టాలీవుడ్ భామ‌లు ఎవ‌రు? అన్న‌ది ప‌రిశీలిస్తే ప‌లువురు టాప్ హీరోయిన్ల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి.

ఇందులో సోనాక్షి సిన్హా- సోన‌మ్ క‌పూర్- దీపికా ప‌దుకొనే- స‌న్నీలియోన్ - క‌త్రిన కైఫ్‌ స‌హా టాలీవుడ్ భామ‌లు పూజా హెగ్డే- కాజ‌ల్- త‌మ‌న్నా- స‌మంత- ర‌కుల్ ప్రీత్- ర‌ష్మిక మంద‌న‌ వంటి టాప్ స్టార్ల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. వీళ్లంతా లాక్ డౌన్ ని బాగానే వినియోగించుకున్నారు. ఇంట్లోనే కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేస్తూనే ఆదాయానికి ఏమాత్రం గండి కొట్టేయ‌కుండా ఎన్నో తెలివైన ఎత్తుగ‌డ‌లు వేశారు. ఈ భామ‌లంద‌రికీ సోష‌ల్ మీడియాలో ఉన్న పాలోయింగ్ దృష్ట్యా కార్పొరెట్ కంపెనీలు వీళ్ల‌తో ప్ర‌చారం చేయించుకునేందుకు పోటీప‌డ్డాయి. అంతేకాదు.. ల‌క్ష‌ల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టాయిట‌.

వైర‌స్ వ‌ల్ల 2020 ఖాళీయే అనుకుంటే ఈ భామ‌లు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని తెలుస్తోంది. ఇక ఇందులో క‌త్రిన .. స‌న్నీలియోన్ సొంత బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసుకునేందుకు పోటీప‌డ్డారు. క‌త్రిన కె బ్రాండ్.. స‌న్నీలియోన్ స్టార్ స్ట‌క్ పేరుతో సౌంద‌ర్య ఉత్ప‌త్తుల బ్రాండ్ల‌ను ప్రారంభించి లాభాల బాట ప‌ట్టించారు. వీటికి వాళ్లే ప్ర‌చారం చేసుకుని చాలా వ‌ర‌కూ పబ్లిసిటీ ఖ‌ర్చుల్ని ఆదా చేశారు.

ప్ర‌ఖ్యాత ఆన్ లైన్ బ్రాండ్ మైంత్రాకు సోనాక్షి సిన్హా బ్రాండ్ ప్ర‌మోట‌ర్ గా ఉంటే టాలీవుడ్ లో అక్కినేని కోడ‌లు సమంత మైంత్రాకు ప్ర‌మోట‌ర్ గా ఉంది. ఈ బ్రాండ్ ప్ర‌చారం కోసం సామ్ ఇంట్లో ఒక చిన్న వీడియో బైట్ కూడా ఇచ్చింది. అలాగే పూజా హెగ్డే `స్వాగ్ సే సోలో` కోసం ప్రచారం చేసింది. చంద‌మామ‌ కాజల్.. తమన్నా .. రకుల్ వీళ్లంతా వివిధ అంతర్జాతీయ బ్రాండ్ల ప్రచారంలో బిజీగా ఉన్నారు. త‌ద్వారా భారీగానే ఆదాయాన్ని ఆర్జించార‌ని తెలుస్తోంది. ఒక సినిమాకి ప‌ని చేస్తే ఎంత సంపాదించ‌వ‌చ్చునో ఏడాదిలో అంత పెద్ద మొత్తాన్ని ఇలా సోష‌ల్ మీడియాల్లో ప‌బ్లిసిటీ చేసి సంపాదిస్తున్నార‌న్న‌ది గ్రౌండ్ రిపోర్ట్.


Tags:    

Similar News