కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయి రోజురోజుకు అమితంగా పెరుగుతుంది. అక్కడ విడుదలైన సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ అందుకుంటున్నాయి. కాంతార సినిమాతో మరోసారి ఆ విషయం చాలా క్లారిటీగా అర్థమయింది. కేజీఎఫ్ సినిమా వేసిన బాటలను ఆ సినిమా మరింత విస్తరింపజేసింది. ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాల వివరాల్లోకి వెళితే..
ముందుగా కేజిఎఫ్ చాప్టర్ 2 అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ తో ఇండియన్ టాప్ సినిమాలలో ఒకటిగా కూడా నిలిచింది. ఈ సినిమా మొత్తంగా 1228.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇక దాని తర్వాత ఇటీవల వచ్చిన కాంతార సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కన్నడ సినిమాల్లో రెండవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని 360.6 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇక కన్నడలో మూడవ స్థానంలో కేజిఎఫ్ ఫస్ట్ చాప్టర్ కొనసాగుతోంది. ఈ సినిమా 226.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ మూడు సినిమాల తర్వాత పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన 777 చార్లీ కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. అంతేకాకుండా ఇండియన్ మూవీ డేటాబేస్ వెబ్ సైట్ ప్రకారం అత్యధిక రేటింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక 2019లో వచ్చిన కురుక్షేత్ర సినిమా కూడా కన్నడలో గత రెండేళ్ల వరకు కూడా టాప్ లిస్టులో కొనసాగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని కన్నడ బాక్సాఫీస్ వద్ద ఐదవ స్థానంలో కొనసాగుతోంది.
ఇక పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమార సినిమా 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో కన్నడ ఇండస్ట్రీలో టాప్ 6 లో కొనసాగుతోంది. ఇక రాబోయే రోజుల్లో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అతిపెద్ద భారీ సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏ స్థాయిలో రికార్డులను అందుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.