వివాదంలో `టాప్ గేర్` టైటిల్‌!

Update: 2022-09-10 01:30 GMT
గ‌త కొంత కాలంగా టైటిల్స్ వివాదాస్ప‌దంగా మారుతున్న విష‌యం తెలిసిందే. ఇరు ప్ర‌క‌టించి, రిజిస్ట‌ర్ చేయించుకున్న టైటిల్స్ ని తెలిసి కొంత మంది, తెలియ‌క మ‌రి కొంత మంది త‌మ సినిమాల‌కు టైటిల్స్ గా ప్ర‌క‌టిస్తూ వుండ‌టంతో అవి వివాదం అవుతున్నాయి. గ‌తంలో టాలీవుడ్ లో చాలా వ‌ర‌కు స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ వివాదాస్పం అయ్యాయి. తాజాగా మ‌రో సినిమా చుట్టూ టైటిల్ వివాదంలో ఇరుక్కుంది. వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో వ‌రుసగా విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు ఫ‌హ‌ద్ ఫాజిల్‌.

తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ కీల‌క పాత్ర‌ల్లో, విల‌న్ గా న‌టిస్తూ త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు. అల్లు అర్జున్ తో క‌లిసి `పుష్ప‌`లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి సంచ‌ల‌నం సృష్టించింది. ఇక రీసెంట్ గా యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి న‌టించిన `విక్ర‌మ్‌` తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది.

వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సృష్టించింది. వ‌రుస సినిమాల‌తో బిజీగా వున్న ఫ‌హ‌ద్ ఫాజిల్ ఓ మ‌ల‌యాళ మూవీలో న‌టిస్తున్నాడు. సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ పై సుధీర్ శంక‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీకి రీసెంట్ గా  `టాప్ గేర్‌` అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేశారు.  అయితే ఈ టైటిల్ చుట్టూ ఇప్పుడు వివాదం చోటు చేసుకుంది. ఈ టైటిల్ మాదేనంటూ యంగ్ హీరో ఆది సాయికుమార్ టీమ్ అంటోంది.

ఆది సాయికుమార్ హీరోగా శ‌శికాంత్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి అనే ప్రొడ్యూస‌ర్ ఓ మూవీని నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లే టైటిల్ ఫ‌స్ట్ లుక్ ని కూడా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో మా టైటిల్ ని ఫ‌హ‌ద్ ఫాజిల్ సినిమాకు పెట్టారంటూ నిర్మాత శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మ‌ల‌యాళ సినిమాని మేము రిజిస్ట‌ర్ చేయించుకున్న టైటిల్ తో ప్ర‌మోట్ చేయ‌డం ఏంట‌ని వాపోతున్నారు. మ‌రి దీనిపై సూప‌ర్ గుడ్ ఫిలింస్ వారు ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News