ఎట్టకేలకు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు నేడు హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో ప్రశాంతంగా సాగుతున్నాయి. రియల్ పొలిటికల్ స్టంట్ తో గత వారం రోజులుగా ఆర్టిస్టుల్లో వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ వేడి నేటితో చల్లారనుంది. శివాజీ రాజా ప్యానెల్.. నరేష్ ప్యానెల్ మధ్య రసవత్తరమైన పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో నేటి సాయంత్రం 8 గంటలకు తేలనుంది. ఒకరిపై ఒకరు హోరాహోరీ గా ఓట్ల వేట సాగించారు కాబట్టి గెలుపు ఇరువైపులా దోబూచులాడుతుందనే అంతా అంచనా వేస్తున్నారు. ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఇప్పటికే దాదాపు 300 మంది ఓట్లు వేసారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. 8 గంటలకు రిజల్టును ప్రకటిస్తారు.
ఇప్పటివరకూ ఎవరెవరు ఓట్లు వేసారు? అన్నదానికి తాజాగా అందిన సమాచారం ప్రకారం... మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, ఆర్ నారాయణమూర్తి, రాజీవ్ కనకాల, జీవితా రాజశేఖర్ దంపతులు, హీరోయిన్ ప్రియమణి, యాంకర్లు ఝాన్సీ, సుమ తదితరులు ఓట్లు వేసారు. మరింతమంది ఆర్టిస్టులు ఈ గంటలోగానే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చాంబర్ లో ఓట్లు వేసే క్యూలైన్ పెద్దగానే ఉందని తెలుస్తోంది.
ఇక సందట్లో సడేమియాలా .. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల బరిలో పోటీపడుతున్న ఇరు ప్యానెల్స్ కి, నరేష్, శివాజీ రాజాలకు జీహెచ్ ఎంసీ పెద్ద షాక్ ని ఇచ్చింది. నిబంధలకు విరుద్ధంగా ఫిలిం చాంబర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసినందుకు వీరికి పెనాల్టీ వేయనున్నారని తెలుస్తోంది. జీహెచ్ ఎంసీ వాళ్లు ఇప్పటికే ఫ్లెక్సీలను తొలగించారు. మా ఎన్నికలకు సంబంధించి మరిన్ని హాట్ అప్ డేట్స్ కోసం.. కీప్ వాచ్ అప్ డేట్స్..దిస్ స్పేస్..