నిన్న మనం ఎన్టీఆర్ మహానాయకుడు-మిఠాయి-అంజలి సిబిఐతో మరో రెండు మూడు చిన్న సినిమాల హడావిడిలో పడ్డాం కాని హింది మూవీస్ రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఛాయస్ గా టోటల్ డమాల్ నిలిచింది. అజయ్ దేవగన్-అనిల్ కపూర్-మాధురి దీక్షిత్- ఈషా గుప్తా-రితీష్ దేశ్ ముఖ్-బొమాన్ ఇరానీ లాంటి భారీ తారాగణంతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా దీని మీద బాగానే అంచనాలు ఉన్నాయి.
అయితే మొదటి ఆట పూర్తవ్వడం ఆలస్యం ఫుల్ నెగటివ్ టాక్ తో క్రిటిక్స్ సినిమాను చీల్చి చెండాడారు. ఈ మధ్య కాలంలో ఇంత చెత్త సినిమా చూడలేదంటూ 2 రేటింగ్ కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అంత ఘోరంగా టోటల్ డమాల్ టైటిల్ ని సార్థకం చేసుకుంది. అయితే ఇది ఒక పాత తెలుగు సినిమా నుంచి స్ఫూర్తి తీసుకున్నది కావడం గమనార్హం
1994లో కిష్కిందకాండ అనే సినిమా ఒకటి వచ్చింది . అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ఆర్టిస్టులు కమెడియన్స్ అందరూ ఇందులో ఉన్నారు. పేరుకు హీరో ఉంటాడు కాని డామినేషన్ అంతా వీళ్ళదే. ఒక శ్మశానంలో దాచి పెట్టబడిన నిధి కోసం వివిధ మార్గాల్లో అందరూ కలిసి ప్రయాణాలు చేయడం తీరా అక్కడికి చేరుకున్నాక ఎవరికి వారు పోటీ పడుతూ డ్రామా చేయడం అంతా ఓ రేంజ్ లో పేలింది. సినిమా కూడా అప్పట్లో మంచి హిట్.
టోటల్ డమాల్ కూడా ఇదే పాయింట్ మీద సాగింది. కాకపోతే స్మశానాన్ని జూగా మార్చారు. కమెడియన్స్ బదులు ఇక్కడ హీరోలను సెట్ చేసుకున్నారు. థీమ్ మాత్రమే అదే. ఇంతోటి దానికి కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ ఏడాది తొలి మెగా డిజాస్టర్ బిరుదు అందుకున్న టోటల్ డమాల్ నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగల్చడం ఖాయమైపోయింది