తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్. తమిళంతో పాటు తెలుగులో ఎన్నో హిట్స్.. సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఈయన. అంతటి సక్సెస్ లను కలిగి ఉన్న ఈ దర్శకుడు గత మూడు నాలుగు ఏళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈయన దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఎన్నై నొక్కి పాయుంతోట చిత్రం ఎప్పుడో విడుదల అవ్వాల్సింది. కాని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సినిమా ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మద్యవర్తుల సహకారంతో ఫైనాన్షియర్స్ మరియు గౌతమ్ మీనన్ రాజీకి రావడంతో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగాయి. సినిమా ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సినిమాను విడుదలపై కొందరు ఫైనాన్షియర్స్ స్టే తీసుకు వచ్చారు. ఆ సినిమా పరిస్థితి అలా ఉంటే మరో స్టార్ హీరో విక్రమ్ తో తీసిన 'ధృవ నక్షత్రం' సినిమా కూడా విడుదలకు నోచుకోవడం లేదు. ఆ సినిమా విడుదల విషయంలో కూడా ఆర్ధిక పరిస్థితులు గౌతమ్ మీనన్ కు చుక్కలు చూపిస్తున్నాయి.
ఒకప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా అంటే తెలుగు మరియు తమిళ హీరోలు ఎంతో మంది ఆసక్తి చూపించే వారు. కాని ఇప్పుడు స్టార్ హీరోలతో తీసిన సినిమాలు కూడా విడుదలకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితికి స్వయానా ఆయనే కారణం అంటూ తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిగా మంచి జోరు మీదున్న సమయంలో నిర్మాణంలోకి అడుగు పెట్టడం అనేది తప్పుడు నిర్ణయం.
తనది తప్పుడు నిర్ణయం అని ఒకటి రెండు సినిమాలకే అర్థం అవ్వాల్సి ఉంది. కాని ఆయన మళ్లీ మళ్లీ అదే తప్పు చేశాడు. దాంతో ఆర్థికంగా చాలా కష్టాల్లో కూరుకు పోయాడు. నిర్మాతగా నష్టపోవడంతో దర్శకుడిగా కూడా క్రేజ్ తగ్గింది. మళ్లీ గౌతమ్ మీనన్ పునర్ వైభవంను సంతరించుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఆయన మాత్రం ఇంకా నిర్మాణ బాధ్యతల నుండి బయట పడలేక పోతున్నాడు.