ఫస్ట్ డే రికార్డులు రంగస్థలం కొడుతుందా?

Update: 2018-03-30 04:20 GMT
ఇవాల్టి రోజుల్లో సినిమా వసూళ్లే ఆయా మూవీ సక్సెస్ కు కొలమానం. ముఖ్యంగా తొలి రోజు వసూళ్లు ఆ సినిమా స్థాయిని తేల్చేస్తున్నాయి. ఒకటి అరా మూవీస్ మినహాయిస్తే.. లాంగ్ రన్ అనే మాటే ఎక్కడా వినిపించడం లేదు. ఇప్పుడు రంగస్థలం తొలి రోజున ఎంత రాబడతాడో అనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో రంగస్థలం చిత్రానికి స్పెషల్ షోలకు పర్మిషన్ వచ్చేసింది. ఉదయం 5 గంటల నుంచి షోస్ వేసుకోవచ్చని జీఓ కూడా జారీ అయిపోయింది. అందుకు తగ్గట్లుగానే బుకింగ్స్ మొదలుపెట్టేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ అన్నీ ఫుల్ అయిపోయాయి కూడా. అయితే.. హైద్రాబాద్ తో పాటు నైజాం ఏరియాలో మాత్రం స్పెషల్ షోస్ కు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ విషయంలో నిర్మాతలు కూడా పెద్దగా ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు రాలేదు. అయితే.. చాలా రోజులకు థియేటర్లను అన్నిటినీ నింపేయగల పెద్ద సినిమా విడుదల అవుతుండడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు రికార్డుల మీద ట్రేడ్ జనాలు ఆసక్తి చూపుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు వసూళ్ల విషయంలో బాహుబలి 42.87 కోట్ల రూపాయలను రాబట్టి తొలి స్థానంలో ఉంది.  ఆ తర్వాత అజ్ఞాతవాసికి 26.36 కోట్లను కొల్లగొట్టింది. థర్డ్ ప్లేస్ లో ఉన్న ఖైదీ నంబర్ 150కి 23.24 కోట్లు వచ్చాయి. బాహుబలి తొలి భాగం 22.4 కోట్లు రాబట్టగా.. 5వ స్థానంలో ఉన్న కాటమరాయుడు 22.27 కోట్లను వసూలు చేశాడు. ఇప్పుడున్న ప్రీ రిలీజ్ బజ్.. అలాగే బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం.. రామ్ చరణ్ మూవీ టాప్3లో చోటు సంపాదిస్తాడనే అంచనాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News