కపూర్ ఫ్యామిలీలో విషాదం.. ఒకప్పటి హీరో కన్నుమూత..!

Update: 2021-02-09 14:00 GMT
బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన కపూర్‌ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రిషి కపూర్‌ ను కోల్పోయిన ఆ కుటుంబం.. ఇప్పుడు అలనాటి హీరో రాజీవ్‌ కపూర్‌(58)ను కోల్పోయింది. రాజీవ్ కపూర్ ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆయన వదిన నీతూ సింగ్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. రాజీవ్ కపూర్ మృతి పట్ల సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

రాజీవ్ కపూర్ ఒకప్పటి బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ చిన్న కుమారుడు. రణధీర్‌ కపూర్‌ - దివంగత రిషికపూర్‌ సోదరుడు. 1983లో రాజ్ కపూర్ నట వారసుడిగా తెరంగేట్రం చేసాడు. 'రాజ్‌ తేరి గంగా మెయిలీ' 'మేరాసాతి' 'హమ్‌ తు చలే పర్దెస్‌' వంటి సినిమాల్లో నటించాడు. నిర్మాతగా పలు నిర్మించిన రాజీవ్.. 'ప్రేమ్‌ గ్రంథ్‌' అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.
Tags:    

Similar News