అత్తారింటికి దారేది - దూకుడు - గబ్బర్‌సింగ్ - బాద్‌షా - మిర్చి... ఒకటేమిటి? ఏ సినిమా కావాలంటే ఆ సినిమాని లోకల్ కేబుల్స్ ప్రసారం చేసేస్తున్నాయి. అయితే వాస్తవానికి ఇలా పైరసీ సీడీల్ని తమ కేబుల్‌లో ఆపరేటర్లు ప్రసారం చేసేయడం పెద్ద నేరం. కానీ అది పట్నం - పల్లె అనే తేడా లేకుండా లోకల్ దందా సాగుతూనే ఉంది. ఇకపోతే అసలు సదరు సినిమాల శాటిలైట్ రైట్లను పెద్ద పెద్ద ఛానళ్ళు కోట్ల మొత్తం వెచ్చించే కొంటే.. వీరు హ్యాపీగా ఒక డివిడి తెచ్చేసి వేసేస్తునా్నరు. త్వరలోనే ఈ దోపిడీకి చెక్ పెట్టనుంది ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా).
స్థానిక కేబుల్ చానల్స్ అనేక సందర్భాలలో పైరసీకి పాల్పడటం ప్రభుత్వచర్యలకు లోను కావటం జరుగుతూనే ఉంది. శాటిలైట్ చానల్ యజమానులు కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాల ప్రసార హక్కులు కొనుక్కుంటూ ఉంటే కేబుల్ చానల్స్ వారు మార్కెట్లో డివిడి కొని తెచ్చి తమ చానల్స్ లో ప్రసారం చేయటం ద్వారా పెద్దమొత్తంలో శాటిలైట్ చానల్స్ కు నష్టాలు వచ్చేట్టు చేస్తున్నారన్నది ప్రధానంగా ఉన్న విమర్శ. నిజానికి అలా చూస్తే కేబుల్ చానల్స్ ప్రసారం చేసే అంశాల్లో సగానికి పైగా పైరసీ కిందికే వస్తుంది. ఇదే విషయం మీద బ్రాడ్ కాస్టర్లతోబాటు డిటిహెచ్ ఆపరేటర్లు కూడా ప్రభుత్వానికి అనేక సందర్భాలలో ఫిర్యాదుచేశారు. కొత్త సినిమాలు ప్రసారం చేసినప్పుడు ఆ సినిమాల హక్కులు కొనుక్కున్న శాటిలైట్ చానల్ యజమానులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులివ్వటం, అందుకు ప్రతీకారంగా ఎమ్మెస్వోలు తమ నెట్ వర్క్ లో ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయటం, మళ్ళీ రాజీ కుదరటం చాలా కాలంగా చూస్తున్న వ్యవహారమే
అయితే, ఈ విషయంలో ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలన్నది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లక్ష్యం. అందుకే ఒక చర్చా పత్రాన్ని విడుదలచేసి అభిప్రాయాలు సేకరించింది. వాటి ఆధారంగా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఒక ఎమ్మెస్వో ఇచ్చే గరిష్ఠ చానల్స్ సంఖ్య మీద పరిమితి విధించటం, ప్రతి కేబుల్ చానల్ కూ లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన విధించటం లాంటి ఎన్నో సిఫార్సులు అందులో ఉన్నాయి. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తుది ఆమోదం పొంది మార్గదర్శకాలు జారీకావాల్సి ఉంది.