కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గతేడాది `డాక్టర్` తో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న శివ కార్తికేయన్ కి `డాక్టర్` రూపంలో వచ్చిన మరో సక్సెస్ తో ఇమేజ్ రెట్టింపు అయింది. కోవిడ్ పాండమిక్ కారణంగా కొన్ని సినిమాలు వాయిదా పడినప్పటికీ ఆ గ్యాప్ ని వీలైనంత త్వరగా ఫుల్ ఫిల్ చేసి ముందకు సాగుతున్నాడు.
తాజాగా శివ కార్తికేయన్ కొత్త చిత్రం `డాన్`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ మరింత హైప్ తీసుకొస్తుంది.
ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తుంది. సినిమాలో శివ కార్తికేయన్ కాలేజీ స్టూడెంట్‌గా నటిస్తున్నాడు. ట్రైలర్‌లో చాలా సన్నివేశాలు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో హైలైట్ అవుతున్నాయి. ఇవి కళాశాల జీవితాన్ని ఒక సంగ్రహావలోకనం చేస్తాయి. రొమాంటిక్ - భావోద్వేగ అంశాలు అంతే హైలైట్ అవుతున్నాయి.
ఆద్యంతం నవ్వించిన ట్రైలర్ ఒక్కసారిగా ఎమోషన్ కి గురి చేస్తుంది. అప్పటివరకూ నవ్వించిన పాత్రలన్ని ఒక్కసారిగా ఎమోషన్ మోడ్ లోకి జారుకుంటున్నాయి. ట్రైలర్ లో బీజీఎమ్ అలరిస్తుంది. శివ కార్తికేయన్ ఈ సారి కూడా తన బలం కామెడీతో బ్యాంకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సముద్రఖని.. సూరి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎరా నడుస్తుంది.
సినిమాలు ప్లాప్ అయినా మ్యూజిక్ పరంగా సక్సెస్ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాంగ్స్ అన్ని చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. అన్ని పనులు పూర్తిచేసుకుని మే 13న ప్రపంచ వ్యాప్తంగా ల చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Full View