ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆదిపురుష్ యొక్క టీజర్ ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. టీజర్ అనౌన్స్ మెంట్ లో భాగంగా ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో ప్రభాస్ విల్లు ఎక్కు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. బాహుబలి లో కూడా విల్లు ఎక్కు పెట్టిన ప్రభాస్ ఈసారి మరింత స్పెషల్ గా కనిపిస్తున్నాడు.
ఈసారి అందరికి తెలిసిన రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న కారణంగా సహజంగానే ప్రభాస్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. పైగా నిజంగా రాముడిని చూసినట్లుగా ఉందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తూ లైక్స్ చేస్తున్నారు.
24 గడచినా కూడా ఆదిపురుష్ ప్రభాస్ పోస్టర్ ను అభిమానులు ఇంకా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో కొందరు ఆదిపురుష్ లోని ప్రభాస్ విల్లు ఎక్కు పెట్టిన ఈ పోస్టర్ ని మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి పాత్ర కోసం రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన పోస్టర్ ను పక్క పక్కన పెట్టి కంపైర్ చేస్తూ ఉన్నారు.
చరణ్ అభిమానులు నిజంగా రాముడిని చూసినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తే... ప్రభాస్ అభిమానులు రాముడు అంటే నిజంగా ఇలాగే ఉండేవాడేమో అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏ హీరో ఎలా విల్లు ఎక్కు పెట్టాడు అనే విషయమై ఇరువురు అభిమానుల మధ్య చర్చ ఒకింత సీరియస్ గా కూడా మారుతుంది.
కొందరు అభిమానులు మా హీరో గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తూ అవతలి హీరోను కించ పర్చే విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఇరువురు అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా విడుదల తర్వాత ఇంకా ఎన్ని రకాలుగా అభిమానులు చర్చించుకుంటారో అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.