చెన్నై బ్యూటీ త్రిష ఇప్పుడు స్పీడ్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కెరీర్ లో అత్యంత కీలకమైన స్టేజ్ లో ఉండడంతో.. కేరక్టర్ల విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. ఇప్పటికే నాయకి.. మోహిని వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న త్రిష.. ధనుష్ తో కలిసి పొలిటికల్ థ్రిల్లర్ లో కూడా యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు తని ఒరువన్ లో విలన్ గా చేసి.. మళ్లీ ఫాంలోకి వచ్చిన అరవింద్ స్వామితో జోడీ కడుతోందనే వార్తలు వచ్చాయి.
రూరల్ ఏరియాల్లో బ్లాక్ మనీ స్కామ్ పై తెరకెక్కిన చతురంగ వేట్టై చిత్రానికి సీక్వెల్ ను తీస్తున్నాడు దర్శకుడు నిర్మల్ కుమార్. తొలి భాగంలో నటరాజ్ హీరోగా నటించగా.. రెండో భాగానికి అరవింద్ స్వామిని హీరోగా ఎంపిక చేశారు. చతురంగ వేట్టై2లో నటిస్తున్నట్లు త్రిష చెప్పడంతో.. అరవింద్ స్వామికి జోడీగా యాక్ట్ చేస్తోందనే అంతా అనుకున్నారు. అయితే.. ఈ మూవీలో త్రిష చేస్తున్నది చాలా ముఖ్యమైన పాత్ర అయినా.. అది అరవింద్ స్వామితో రొమాన్స్ చేసే రోల్ కాదని చెబుతున్నాడు దర్శకుడు నిర్మల్ కుమార్.
చతురంగ వేట్టై2ను సిటీల్లో పేరుకుపోతున్న బ్లాక్ మనీని బేస్ చేసుకుని తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన చేతిలో ఉన్న మోహిని.. కోడి.. చతురంగ వేట్టై సీక్వెల్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని త్రిష టార్గెట్ పెట్టేసుకుంది.