త్రిషలా ఉండాలంటే ఏం చేయాలి?

Update: 2015-07-28 16:12 GMT
ఎప్పటికప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తుండాలి.. ప్యాకప్ చెప్పినంత ఈజీగా బ్రేకప్ చెప్పేయాలి.. నిశ్చితార్థాలు రద్దు చేసుకోవాలి.. పైన ప్రశ్న చూసి ఇలాంటి కొంటె సమాధానాలు మాత్రం ఇవ్వకండి. ఇక్కడ అడుగుతోంది.. ఒంటిమీదికి 32 ఏళ్లొచ్చినా ఆ ప్రభావం ఏమీ కనిపించకుండా త్రిషలా నాజూగ్గా, ఛార్మింగ్ గా కనిపించాలంటే ఏం చేయాలని? ఈ ప్రశ్న ఎవరినో అడగడం ఎందుకని త్రిషనే అడిగితే తాను ఏం చేస్తున్నానో అందరూ అదే చేస్తే సరి అంటూ సమాధానమిచ్చింది. ఇంతకీ ఆమె రోజూ ఏం చేస్తుందో, ఏం తింటుందో ఆమె మాటల్లోనే విందాం పదండి.

‘‘నేను రోజూ ఉదయం యోగా చేస్తా. ఆసనాలు వేయడం ముఖ్యం కాదు. ఐతే స్ట్రెచింగ్ ఆసనాలు చాలా ముఖ్యం. కార్డియో ఎక్సర్ సైజ్ తో పాటు ఇంకొన్ని వ్యాయామాలు చేస్తా. ఖాళీ దొరికిందంటే చాలు స్విమ్మింగ్ పూల్ లో దూకేయడం నాకు అలవాటు. ఈత వల్ల బాడీకి జరిగినంత మేలు ఏ ఎక్సర్ సైజ్ వల్లా జరగదు. యోగా, ఎక్సర్ సైజ్, ఈత.. ఈ మూడింటికీ కలిపి ఓ రెండు గంటలు కేటాయించారంటే మీకు తిరుగుండదు’’ అని చెప్పింది త్రిష.

ఐతే కేవలం ఎక్సర్ సైజ్ లు మాత్రమే శరీరాన్ని కాపాడవని.. ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెబుతూ.. తన డైట్ విశేషాలు వివరించింది. ‘‘ఉదయం గ్రీన్ టీతో మొదలుపెడతా. బ్రేక్ ఫ్లాస్ట్ చాలా ఎక్కువ తీసుకుంటా. పరోటాలు, ఆమ్లెట్లు.. ఇలా ఏదనిపిస్తే అది బాగా తింటా. కడుపు ఫుల్లవుతుంది. బ్రేక్ ఫాస్ట్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచేది బ్రేక్ ఫాస్టే. ఐతే లంచ్ వరకు మరే చిరుతిళ్లూ తినను. నీళ్లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటా. లంచ్, డిన్నర్ ఇదే ఉండాలనేం లేదు కానీ.. ఏదైనా తింటా. అవీ, ఇవీ తినను అని నోరు కట్టేసుకోను. కానీ ఏం తిన్నా కొంచెమే తింటా. నాకు సీ ఫుడ్ చాలా ఇష్టం. అందుల ఫ్యాట్ కూడా తక్కువే కాబట్టి తినడానికి ఏం మొహమాట పడను’’ అని చెప్పింది త్రిష. రోజుకు కచ్చితంగా ఆరేడు గంటలు నిద్ర పోతానని.. దాని వల్ల ఉదయం ఫ్రెష్ గా తయారవుతానని ఆ మె చెప్పింది.
Tags:    

Similar News