త్రిష కౌగిట్లో ఆ బాహుబ‌లి ఫ్రెండు ఎవ‌రు?

Update: 2020-06-02 03:30 GMT
ప్ర‌స్తుత దిగ్భంధ‌న స‌మ‌యాన్ని ఒక్కో స్టార్ ఒక్కోలా వినియోగిస్తున్నారు. ప‌లువురు నిరంత‌ర వ్యాయామంతో ఇప్ప‌టికే టోన్డ్ బాడీని ఎలివేట్ చేస్తున్నారు. అదే బాట‌లో అందాల త్రిష కూడా ఓ ప్ర‌త్యేక‌మైన వ్యాయామం చేస్తోంది. అది కూడా త‌న ఇష్ట స‌ఖుడి కౌగిలింత దిగ్భంధ‌నంలో ఈ వ్యాయామం చేస్తోంద‌ట‌. ఈ సంగ‌తిని త‌నే స్వ‌యంగా వెల్ల‌డించింది.

ఇదంతా త్రిష ఎందుకు చేస్తోంది? అంటే.. కండ‌ర పుష్టికోస‌మేన‌ట‌. బైసెప్.. ట్రైసెప్స్ ఇంటి వ్యాయామం కోసం ఒక చమత్కారమైన మార్గాన్ని త్రిష క‌నుగొంది. తాజా ఇన్ స్టా పోస్ట్ లోని ఒక వీడియోలో, త్రిష తన కుక్క జోర్రోతో ఆట‌లాడుకుంటూ క‌నిపించింది. ఈ కుక్క‌కు ఒక బొమ్మ తాడు ఉపయోగించి ఆటాడుతోంది. అదో బొమ్మ మాత్ర‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ కుక్క దానిని లాగడం కనిపిస్తోంది. ఆ తర్వాత బొచ్చు కుక్క‌ స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకుంది త్రిష‌. బీస్టెస్ట్ పార్ట‌న‌ర్ అంటూ పొగిడేసిందంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ఉత్తమ దిగ్బంధన‌ భాగస్వామి అన్న క్యాప్ష‌న్ తో వీటిని సోష‌ల్ మీడియాలో పంచుకుంది త్రిష‌. అంతేకాదు ఇంట్లో పావ్ భాజీ ఫోటోని షేర్ చేసిన త్రిష‌... రుచికరమైన వంటకం అంటూ నోరూరించేసింది. ఇక కెరీర్ సంగ‌తి చూస్తే... 96 ఘ‌నవిజ‌యం త‌ర్వాత వ‌రుస క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్న త్రిష ప్ర‌స్తుతం త‌న గురువు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో `పొన్నియిన్ సెల్వన్`లో న‌టిస్తోంది. ఇందులో ఐశ్వ‌ర్యారాయ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాంగి - షుగర్ -రామ్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ప్ర‌స్తుత స్వీయ దిగ్భంధ‌న స‌మ‌యంలో మాత్ర‌మే త‌న‌కు తీరిక చిక్కింది. 


Tags:    

Similar News