త్రిష!! సిమ్రానా? నయనతారా?

Update: 2017-12-21 06:30 GMT
హీరోయిన్లు సీనియర్ గా మారిపోయిన తర్వాత వారి కెరీర్ ఎటు టర్న్ అవుతుంది అంటే ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టమే. కెరీర్ పూర్తయిపోతే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతుంటారు. మరికొందరు తమ ట్యాలెంట్ చాటుతూనే ఉంటారు. కానీ కెరీర్ చివరకు వచ్చేసింది అనిపించుకుని.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన భామ త్రిష.

వర్షం మూవీ నుంచి ఇప్పటివరకూ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ చెన్నై భామ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉందనే చెప్పాలి. భయపెట్టే హారర్ సినిమాలతో కూడా ట్రై చేస్తోంది కానీ.. అంతగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఇవాళ సాయంత్రం త్రిష లేటెస్ట్ మూవీ మోహిని ట్రైలర్ రిలీజ్ కానుంది. ఓ రకంగా చెప్పాలంటే.. త్రిషకు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ఒకవేళ మోహిని ట్రైలర్ తో ఆకట్టుకుని.. సినిమాను సక్సెస్ రూట్ లో నిలిపితే.. నయనతార మాదిరిగా గ్లామర్ టు ట్యాలెంట్ కు చేరిన హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటుంది.

రొటీన్ సినిమా అనిపించుకుంటే మాత్రం.. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు మినహా.. మళ్లీ కొత్తకొత్త ఆఫర్స్ రావడం కష్టమే. గ్లామర్ హీరోయిన్ పాత్రలు ఎలాగూ రావు. ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కష్టమైపోతుంది. అంటే సిమ్రాన్ మాదిరిగా ఫేడవుట్ అయిపోవాల్సి వస్తుందన్న మాట. మరి ఇప్పుడు త్రిష.. సిమ్రాన్ రూట్ లోకి వెళుతుందా.. నయనతార టైపులో సత్తా చాటుతుందో.. ఇవాళ సాయంత్రం తెలుస్తుంది.



Tags:    

Similar News