రెండేళ్ల కింద ఆగిన సినిమా.. ఇప్పుడు..

Update: 2018-07-17 11:53 GMT
  త్రిష ప్రధాన పాత్ర పోషించిన ‘మోహిని’ చిత్రం ఈనెల 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా చిత్రం ట్రైలర్ అండ్ ఫస్ట్ లుక్  ను రిలీజ్ చేశారు. 4 జతల చేతులతో సీరియస్ గా కనిపిస్తున్న త్రిష స్టిల్ ఆసక్తి రేపుతోంది.

అయితే సరిగ్గా రెండేళ్ల కిందట 2016 జూన్ లో ఈ సినిమా లండన్ లో మొదలైంది. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక డబ్బులు లేవని నిర్మాత చేతులెత్తేయడంతో సినిమా ఆగిపోయింది. ఎట్టకేలకు త్రిష చొరవ తీసుకొని మరో తమిళ నిర్మాత సహకారంతో మోహని చిత్రాన్ని పూర్తి చేసింది. అసలే హిట్స్ లేక అల్లాడుతున్న త్రిష ఇప్పుడు తన తాజా చిత్రం ‘మోహని’పైనే గంపెడాశలు పెట్టుకుంది.

తెలుగులో విశాఖకు చెందిన డిస్ట్రిబ్యూటర్ సినిమా రైట్స్ దక్కించుకున్నాడు. తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తికాలేదు. ఈ నెలాఖరుకు ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News