ఒక హీరోయిన్ పరిశ్రమకు వచ్చి 16 ఏళ్ళైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారకుండా ఇంకా హీరోయిన్ గానే కొనసాగడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహకు కూడా అందదు. మహా అయితే ఐదేళ్లకు మించి టాప్ లీగ్ లో ఉండటం కష్టమైన పరిస్థితుల్లో ఏకంగా దశాబ్దం పైగా ఆ స్థాయిని ఎంజాయ్ చేసిన త్రిషకు ఇప్పటి దాకా తీరని కల సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించడం. తెలుగు తమిళ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి బ్లాక్ బస్టర్స్ కొట్టిన త్రిషను ఆ లోటు చాలా కాలం వెంటాడింది. ఫైనల్ గా పెట్టాతో ఆ కోరిక తీరిపోయింది.
రేపటి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి ఏకధాటిగా నెల రోజుల షెడ్యూల్ లో త్రిష పెట్టా షూటింగ్ లో బిజీ అయిపోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా వెల్లండించిన త్రిష పాత్ర స్వభావానికి సంబందించిన చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. సిమ్రాన్ మరో హీరోయిన్ గా నటిస్తున్న పెట్టాలో త్రిష రోల్ కు నెగటివ్ షేడ్స్ ఉంటాయని కోలీవుడ్ టాక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాబీ సింహా విజయ్ సేతుపతి లాంటి యంగ్ యాక్టర్స్ రజని కొడుకులుగా నటించడం విశేషం.
ఇదొక ఆనందం అయితే త్రిష మొదటి సారి విజయ్ సేతుపతికి జంటగా నటించిన 96 అక్టోబర్ 4న విడుదల కాబోతోంది. ఊహించిన దాని కన్నా అనూహ్యమైన స్పందన విడుదలకు ముందే దక్కడం పట్ల త్రిష ఆనందం రెట్టింపవుతోంది. రిలీజ్ కు ముందే రీమేక్ రైట్స్ కోసం పోటీ ఏర్పడటం మరో కారణంగా చెప్పుకోవచ్చు. 1996లో విడిపోయిన ఇద్దరు స్కూల్ మేట్స్ ఇప్పుడు కలుసుకుంటే ఎలా ఉంటుంది అనే సున్నితమైన పాయింట్ తో సెన్సిటివ్ లవ్ స్టోరీ గా దర్శకుడు ప్రేమ్ దీన్ని తీర్చిదిద్దాడని చెబుతోంది త్రిష.
ఇటీవలే వచ్చిన మోహిని నిరాశ పరిచినా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఆపనని చెబుతున్న త్రిష ఈ విషయంలో నయనతార అనుష్క లాంటి వాళ్ళు బలంగా ఉనికిని చాటుతున్నప్పుడు తాను కూడా అదే దారిలో వెళ్తాను అని చెబుతోంది. మొత్తానికి అటు రజని షూటింగ్ లో జాయిన్ కావడం ఇటు 96 మూవీ విడుదల కావడం పట్ల త్రిష గాల్లో తేలుతోంది.