అది ఇప్పట్లో కుదరదంటున్న త్రిష

Update: 2015-07-25 11:13 GMT
సినిమాలు తగ్గాక... రోజూ వార్తల్లో ఉండానికి నటీనటులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ఏదో ఒక అంశంపై అలా లీక్ వదులుతుంటారు. అది వర్కవుట్ అయితే ఓకే... లేకపోతే మాత్రం అబ్బే అదేంలేదు... తప్పంతా రాసినోళ్లదే అని బుకాయించేస్తుంటారు. చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా చేతిలో సినిమాలు లేని త్రిష.. ఇప్పుడు ఇదే చేస్తోంది.

పెళ్లి వ్యవహారం నిశ్చితార్ధం ఎపిసోడ్ దగ్గరే ఆగిపోవడంతో... ఇక త్రిష పాలిటిక్స్‌లో కి ఎంట్రీ ఖాయమనే వార్తలొచ్చాయి. అంతకుముందు తండ్రి కాలం చేయడం, మందు మత్తులో పబ్లిక్‌‍‌లోనే న్యూసెన్స్ చేసిందనే న్యూస్, ఇప్పుడు అర్ధాంతరంగా ఆగిన పెళ్లి... మొత్తం మీద ఈ మాజీ స్టార్ హీరోయిన్‌ కి వ్యక్తిగత జీవితంపై విరక్తి చెంది.. రాజకీయాల్లో కి వెళ్తోందనే వార్తలు షికారు చేశాయి.

అసలే ఈ అమ్మడు... 'అమ్మ'కి వీరాభిమాని. త్రిష ఫేస్‌ బుక్ పేజ్‌ లో కూడా జయలలిత తో దిగిన ఫోటోనే దర్శనమిస్తుంది. అన్నాడీఎంకే అంటే అంతో ఇంతో అభిమానం కూడా ఉంది. కాబట్టీ పొలిటికల్ తీర్ధం పుచ్చుకుంటోందని మీడియా కోడై కూశాక... ఇప్పుడు తీరిగ్గా అబ్బేం వాటితో నాకేం సంబంధం లేదంటోంది త్రిష. నేనా! పాలిటిక్సా... ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదు నాకు... ఇప్పుడే కాదు.. ఇప్పట్లో అంటే సమీప భవిష్యత్తులో వెళ్లను కూడా అంటూ... ట్వీటేసింది డస్కీ బ్యూటీ.

ఇదేదో న్యూస్ వచ్చిన మొదటి రోజే చేయచ్చు కదా! అబ్బే అలా చెబ్తే... ఫ్రీ పబ్లిసిటీ వచ్చేదెలా? అదన్నమాట సంగతి... మొత్తానికి  యాక్టర్లు సినిమాల్లో నటించడంతోపాటు.. రాజకీయాలు కూడా వంట పట్టించేసుకుంటున్నారు. వాటిని పబ్లిసిటీ గిమ్మిక్కులుగా వాడేసుకుంటున్నారని అనిపిస్తోంది. అయినా ఒక డౌట్ మాత్రం మిగిల్చేసింది త్రిష. నియర్ ఫ్యూచర్‌లో వెళ్లనంటే... మరి ఫార్ ఫ్యూచర్ సంగతేంటో?
Tags:    

Similar News