తమిళ స్టార్ హీరోయిన్ త్రిష.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎంత పెద్ద అభిమానో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అమ్మపై తన అభిమానాన్ని పలుమార్లు చాటుకున్న త్రిష.. అన్నాడీఎంకే పార్టీలోనూ చేరొచ్చన్న ప్రచారం ఈ మధ్య గట్టిగా జరిగింది. జయలలిత పాత్రను వెండితెరపై పోషించాలన్న అభిలాషను కూడా త్రిష వ్యక్తం చేసింది.
ఐతే అమ్మ మీద అంత అభిమానం చూపించిన త్రిష.. జయ అంతిమ సంస్కారాల సమయంలో సమీపంలో ఎక్కడా కనిపించలేదు. ఐతే అలాగని త్రిష అక్కడికి రాలేదనుకుంటే పొరబాటే. జయ చనిపోయిన రోజు ఆమె ఖననం చేసిన చోటికి వచ్చింది త్రిష. కానీ విపరీతమైన జన సందోహం వల్ల అమ్మ పార్థివ దేహం దగ్గరికి రాలేకపోయింది త్రిష. ఖననం తర్వాత కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
మొత్తంగా మూడుసార్లు అమ్మకు చేరువగా వెళ్లేందుకు ప్రయత్నం చేసి.. సాధ్యం కాక చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయిన త్రిష.. షూటింగ్ కోసమని తర్వాతి రోజు నుంచి కేరళకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఆదివారం నాడు త్రిష.. జయ సమాధిని దర్శించింది. అమ్మకు నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జయలలిత లేని లోటును ఎవ్వరూ తీర్చలేరని.. రాజకీయంగానే కాక ఒక మహిళగా ఎందరికో ఆమె స్ఫూర్తి ప్రదాత అని త్రిష కొనియాడింది.