డస్కీ బ్యూటి త్రిష గురించిన రోజుకో వార్త సంచలనం అవుతూనే ఉంది. ఇటీవలే పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది అన్న వార్త ప్రపంచమంతా దావానలంలా చుట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న త్రిష అభిమానుల్లో ఇదో పెద్ద డిష్కసన్ పాయింట్ అయ్యింది. అసలు దక్షిణాది సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన ఓ అమ్మడికి ఇంత కష్టం వచ్చిందే అంటూ నోళ్లు నొక్కేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్త వింటే గోళ్లతో రక్కేసుకోవడం ఖాయం.
ఇంతకీ విషయం ఏమంటే.. త్రిష త్వరలోనే రాజకీయ ఆరంగేట్రం చేయబోతోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రయత్నాలు చాలా సీరియస్ గా చేస్తోందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ అమ్మడికి అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అంటే విపరీతమైన అభిమానం. తన బాటలోనే పెద్ద రాజకీయ నేత అవ్వాలని త్రిష భావిస్తోందిట. అందుకే తను ఫేస్ బుక్ లో సైతం జయలలితతో దిగిన ఫోటోనే పెట్టుకుంది. జయలలిత అభిమాని కాబట్టి అన్నా డీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకోబోతోందంటూ ప్రచారం సాగుతోంది.
అయితే త్రిష ఇంత సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలే అని చెప్పుకుంటున్నారు. కెరీర్ ఆరంభమే త్రిష అల్లరి పాలైంది. త్రిష బాత్ రూమ్ స్నానాలు అంటూ ఆకతాయిల ఎమ్మెమ్మెస్ తనని ఎంతో ఆబాసు పాల్జేసింది. అలాగే ఓసారి మధ్యం తాగి పబ్లిక్ లో రుబాబు చేసిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత తల్లి నుంచి విడిపోయి విడిగా ఉంటున్న తన తండ్రి మరణం కూడా తనని కలచివేసింది. లేటెస్టుగా నిశ్చితార్థం వరకూ వెళ్లిన పెళ్లి ఆగిపోయింది. ఇలా వ్యక్తిగత జీవితం పూర్తిగా విసిగించింది.
అందుకే ఇక పెళ్లి గిళ్లీ జాన్తానయ్ అనుకుని పూర్తిగా రాజకీయ జీవితానికి అంకితమవ్వాలని త్రిష భావిస్తున్నారట. అంటే జయలలిత వారసురాలిగా ముఖ్యమంత్రి అయిపోతుందేమో?