అది స్త్రీలకు దక్కిన గౌరవం: త్రిష

Update: 2018-10-01 11:16 GMT
కేరళలోని ప్రముఖ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.. ఈ తీర్పుపై సంప్రదాయ వాదులందరూ వ్యతిరేకిస్తుండగా.. సామాజికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇలా మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాస్పద అంశాల్లో ఎప్పుడూ ముందుండే నటి త్రిష తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.

 ఆ మధ్య సహజీవనం సబబే అని కోర్పు తీర్పును స్వాగతించిన త్రిష.. తాజాగా చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. శబరిమల అయ్యప్సస్వామి దేవాలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు.. స్త్రీలకు దక్కిన గౌరవం అని త్రిష పేర్కొంది. ఇటీవల త్రిష నటించిన 96 చిత్ర ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న త్రిష ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం గురించి తనకు పూర్తిగా తెలియదని.. కానీ ఎవరినీ ఇలా అడ్డుకోవడం మాత్రం కరెక్ట్ కాదంటూ పేర్కొంది. నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే త్రిష కామెంట్స్ పై సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. 
Tags:    

Similar News