పుష్కర కాలంకు పైగా హీరోయిన్ స్టార్ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ త్రిష గత కొంత కాలంగా హీరోయిన్ ఆశించిన సక్సెస్ లను అందుకోలేక పోతుంది. స్టార్ హీరోల సరసన ఈమెకు అవకాశాలు రావడం లేదు. దాంతో ఈమె కెరీర్ ఖతం అయినట్లే అనుకుంటున్న సమయంలో అనుకోని అవకాశం అన్నట్లుగా రజినీకాంత్ 'పేట' చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. అంతకు ముందు 96 చిత్రంలో కూడా నటించి సక్సెస్ అయ్యింది. ఈ రెండు చిత్రాలతో త్రిష క్రేజ్ ఇంకా మంచి క్రేజ్ కలిగి ఉందని నిరూపితం అయ్యింది. అందుకే త్రిషతో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని నిర్మించేందుకు లైకా ప్రొడక్షన్స్ సిద్దం అయ్యింది.
ఒక వైపు నయనతార హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకు పోతున్న ఈ సమయంలో త్రిష కూడా అలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటికే ఈమె చేసిన రెండు మూడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ విడుదలైన 'నాయకి' చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.
తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ చిత్రం విడుదలై ఫ్లాప్ అయ్యింది. ఆ చిత్రం మాత్రమే కాకుండా తమిళంలో ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసేందుకు ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. తాజాగా లైకా ప్రొడక్షన్స్ లో శరవణన్ దర్శకత్వంలో రూపొందబోతున్న హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించబోతుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన 'జర్నీ' చిత్రాన్ని శరవణన్ తెరకెక్కించాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న శరవణన్ తప్పకుండా తనకు సక్సెస్ ఇస్తాడనే నమ్మకంతో త్రిష ఉంది. మరి ఆమె నమ్మకం నిలిచేనా చూడాలి.